
గిరిజనేతరుల అన్యాయాల నుండి మమ్మల్ని కాపాడండి
మాలోతు నీలా
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
మే 20
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తురుబాక గ్రామ పరిధిలో శ్రీ వెంకటేశ్వర ట్రైబల్ మహిళా ఇసుక క్వారీ పరస్పర సహాయక సహాకార సంఘం. లిమిటెడ్ తూరుబాక. రిజిస్ట్రేషన్ నెంబర్: ఏ ఎం సి/ భద్రాద్రి కొత్తగూడెం డి. సి. ఓ./154/2021 తురుబాక ని 2021 లో 24 మంది సభ్యులతో స్థాపించారు.
దీనికి మాలోతు నీలా అధ్యక్ష పదవికి ఎంచుకున్నారు. గిరిజనులమైన మెము ప్రశాంతంగా నడుస్తున్న మా సొసైటీని కొంతమంది గిరిజనేతరులు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు జిల్లా సహకార అధికారి (డి సి ఓ ) తో కలిసి సంఘం ని చిన్నాభిన్నం చేస్తూ గిరిజనుల హక్కులను కాలరాస్తూ మా కష్టం దోచుకుంటున్నారు. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు.
అడ్డు చెప్పిన నన్ను సంఘం నుండి తొలగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అధికారుల అండదండలు ఉండటం గమనార్హం. ఈ సొసైటీ ఏర్పాటు కొరకు మొదటి నుండి నేను కొనసాగుతున్నాను. గిరిజనుల పేరు చెప్పుకుంటూ దోచుకుంటున్న ఈ గిరిజనేతరుల నుండి సంఘాన్ని కాపాడాలని మా గిరిజనులకు న్యాయం చేయాలని, సంఘం ఉనికి కోసం ఎంతవరకైనా పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.