
ప్రభుత్వ భూములు గిరిజనేతరుల చేతిలో కబ్జాలో ఉన్నాయి
పాయం సత్యనారాయణ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 05,
గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ అక్రమంగా దొడ్డిదారిన పొందిన గిరిజనేతరుల భూమి పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో చింతా రాములు అధ్యక్షత న జరిగిన సమావేశంలో పాయం సత్యనారాయణ మాట్లాడుతూ
భద్రాచలం తసిల్దార్ పై కూడా దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు లెక్కలేని విదంగా తయారు అవుతున్నాయి మరియు ప్రభుత్వ భూములు గిరిజనేతరుల చేతిలో కబ్జాలో ఉన్నాయి.
ప్రభుత్వ భూమిలో నిరు పేదలు ఇండ్లు లేని ఆదివాసీలు 5 షెడ్యూల్ ప్రాంతంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవించే హక్కు ఉన్నది. స్థానిక గిరిజనేతరుల 6 ఎకరాల భూమికి హైకోర్టు ఆర్డర్ ఉన్నది. కానీ ఆయొక్కఆర్డర్ ను సాకు గా చూపించి గిరిజనేతరులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి 13 ఎకరాల భూమిని గిరిజనేతరుల పక్షాన నిలబడి కబ్జాదారులకు కొమ్ము కాశారు.
ఇదే 13 ఎకరాల భూమిలో ఆదివాసీలు 4 నెలల నుండి గుడిసెలు వేసుకొని వున్నారు. గతనెల మార్చ 03,2023 అర్ధరాత్రి జిల్లా పోలీస్ యంత్రాంగం చుట్టూ పక్కల కరెంట్ తొలగించి వలస గిరిజనేతరుల తో కుమ్మకై మహిళలు అనిచూడకుండా విచక్షణ రహితంగా దాడిచేసి మహిళలను గాయపరిచి. దౌర్జన్య ఖండా కొనసాగించారు. ఈ విషయం పై స్థానిక ఐటీడీఏ పి ఓ కి పిర్యాదు చేసినాము రాజుపేట కాలనీ ఆవరణలో జరిగిన ఈసంఘట జరిగి నెల రోజులు గడుస్తున్నా ఐటీడీఏ అధికారుల దృష్టికి మరియు ఆర్డీవో దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ భూమి కబ్జాదారుల పై గిరిజనేతరుల పై ఇంత వరకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్ట లేక పోవడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
ఏజెన్సీ 1/70చట్టం ప్రాంతంలో భూ బదలాయింపు చట్టం ప్రకారం బదలాయింపులు జరగాలి…కానీ ఏజెన్సీ లో వారికి ఇష్టం వచ్చినట్టు గిరిజనేతరుల కు అడ్డదారిలో అవినీతికి కొందరు అధికారులు పట్టాలు మంజూరు చేస్తున్నారు. కావున దొంగ పట్టాలు తో భూములు అనుభవిస్తున్న కొందరి గిరిజనేతరుల పట్టాలను తక్షణమే రద్దు చేసి ఆ భూములను ఇండ్లు లేని నిరు పేద ఆదివాసీలకు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు..
అలాగే జిల్లా లో కొంత మంది తసిల్దార్ లు చట్టాన్ని ఏమాత్రం పరిగణనoలోకి తీసుకోకుండా అక్రమాలకు పడుతున్నారు అని ఆరోపించారు వారి పైన కూడా జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ యొక్క సమావేశంలో చింతా కమల్,వెంకటేశ్వర్లు,మధు తదితరులు పాల్గొన్నారు..