
తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని పాదయాత్ర చేపట్టిన గిరిజనులు
పల్లిపాడు నుంచి ఏన్కూరు మెయిన్ రోడ్డుపై మంగాపురం వద్ద బైటించి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు….
వారం రోజుల్లో పనులు ప్రారంభించక పోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడతాం …
గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
కొణిజర్ల:-9-3-2023
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జంపాల నగర్ మేకలకుంట చెందిన గిరిజన నాయకులు ధరావత్ మాన్సింగ్ నాయక్ గిరిజన సంఘ మండల అధ్యక్షులు తేజావత్ కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో వందలాది మంది గిరిజనులు జంపాల నగర్ నుంచి మేకల కుంట తారు రోడ్డు పనులు ప్రారంభించాలని నాలుగు సంవత్సరాల నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐటీడీఏ అధికారుల మొండి వైఖరి నిరసిస్తూ కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జంపాలనగర్ నుంచి పాదయాత్రను గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రారంభించారు. జంపాల నగర్ నుంచి మేకలకుంట మీదుగా మెయిన్ రోడ్డు మంగాపురం వద్దకు శంకుస్థాపన శిలాఫలకం చేరుకొని నినాదాలు ఇస్తూ నిరసన తెలిపారు. అనంతరం గిరిజనులు భారీ ఎత్తున మెయిన్ రోడ్డుపై కూర్చొని రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించాలని రోడ్డు పనులు ప్రారంభించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత గిరిగిన సంఘం ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ఐటిడిఏ ద్వారా నిధులు కేటాయించాలని పోరాడి సాధించుకున్న నిధులతో, తారు రోడ్డు మంజూరు అయిందని శంకుస్థాపన జరిగి నాలుగు సంవత్సరాలు దాటుతున్న ఇప్పటివరకు రోడ్డు పూర్తి చేయకపోవడం బాధ్యత రాహిత్యం అని విమర్శించారు. ఐటిడిఏ అధికారులు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు, వెంటనే ఐటిడిఏ అధికారులు కాంట్రాక్టు పై చర్యలు తీసుకొని పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో మేకల కుంట నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడతామని ప్రభుత్వ ఉన్నత అధికారులకు హెచ్చరించారు. పోరాడితే తప్ప అధికార యంత్రాంగం పనిచేయదని గిరిజనులంతా ఐక్యంగా కలిసికట్టుగా పోరాడి రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి భానోతు హరిచంద్, భూక్యా సక్రు నాయక్, ధరావత్ బాబూలాల్ ,భూక్య లక్ష్మణ్ ,భద్రు తేజావత్ అశోక్, భూక్యా నవీన్ ,రాంజీ అనిల్ ,దుర్గాప్రసాద్, సురేష్ ,సంపత్ ,భూక్యా లవకుశ, శ్రీను ,అరుణ ,దేవి ధరావత్ రంగమ్మ ,అమ్మి మాలోతు దుర్గా తదితరులు పాల్గొన్నారు