
*ఖమ్మం జిల్లా గిరిజన బిడ్డకు సామాజిక సేవలో డాక్టరేట్ అవార్డు: వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్*
*”తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ డాక్టరేట్ అవార్డుతో పాటు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక.”*
వివరాల్లోకి వెళ్ళితే ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం, గోరిలపాడు తండా గ్రామపంచాయతీ శివారు చాంప్లా తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ S/o మట్యా నాయక్ గడిచిన 30 సంవత్సరాలనుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పలు మారుమూల గ్రామాల్లో పేదలకు అందించిన పలుసేవలు చాలా మంది జీవితాల్లో ఆశలు వదులుకున్న పలువురు నిరుపేదలు వారి జీవితంలో ఆశలు చిగురించాయి అనుట్లో సందేహంలేదు.
ఉదాహరణకు చాలామంది “క్యాన్సర్ పేషెంట్స్ మరియు ఇతర కుదుటపడని అనారోగ్యల” కారణంగా ఆర్ధికంగా పరిస్థితులు బాగులేక దిక్కుతోచని పరిస్థితిలో దాతలకొరకు ఎదురుచూచిన పలువురి విషయంలో ఉడతాభక్తిగా తనవంతు సహాయాన్ని అందించి సమాజంలో పలువురు మానవత్వంతో స్పందించాలని పిలుపును ఇవ్వడంతో కొందరు ముందుకొచ్చి సదరు రోగిని ఆదుకునే ప్రయత్నాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
అంతేగాక ప్రభుత్వం కూడా సహాయం చేసి సంబంధిత రోగులను ఆదుకోవాలని పలుసార్లు ట్వీట్టర్ వేదికగా అటు పేషెంట్స్ కి ఇటు ప్రభుత్వానికి వారధిగా నిలిచి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ బాధ్యతలు తీసుకొని చాలామంది సహాయం పొందుకునేలా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ నేపథ్యంలో సామాజిక సేవలో డాక్టర్ పీటర్ నాయక్ చేస్తున్న మంచి కార్యక్రమాలను గుర్తించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ డాక్టర్ పీటర్ నాయక్ ను సామాజిక సేవలో డాక్టరేట్ అవార్డు ఇవ్వాలని భావించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నవంబర్ 2022న దుబాయిలో జరిగిన WHRPC అవార్డ్స్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందించారు.
కానీ అదే నెలలో 30వ తేదీన హైదరాబాద్, సరూర్ నగర్ లో “నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ డీజీసీఈఓ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఒక ప్రాముఖ్యమైన మీటింగ్ ఉండడంతో నేను రాలేను అని WHRPC అధిష్టాననికి తెలియజేయడంతో నాకు ఇస్తానన్న అవార్డు” కొరియర్ ద్వారా నాకు కొంత ఆలస్యంగా అందిందని డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మీడియాకు తెలిపారు. జీవితంలో ఎదురుకున్న ప్రతి అనుభవం నన్ను ఇంతవరకు నిలబెట్టిందని వారు ఆనందభాష్పన్ని వ్యక్తపరిచారు.
*”వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్” అందించిన గౌరవ డాక్టరేట్ అవార్డుతో పాటు నేషనల్ వైస్ ప్రెసిడెంట్”* గుర్తింపునుబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని డాక్టర్ పీటర్ నాయక్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో చాలామంది వారి అనారోగ్యం నుండి కోలుకున్నవాళ్లు ఉన్నారు, వారిలో కొందరు చనిపోయిన వాళ్ళుకూడా ఉన్నారు.
సేవ దృక్పధంతో పలువిధాలుగా సామాన్యులకు అండగా నిలుస్తూ చనిపోయిన వాళ్ళ విషయాల్లో డాక్టర్ పీటర్ నాయక్ స్వయంగా దగ్గరుండి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించి వారి కుటుంబ సభ్యుల గురించి పూర్తిగా తెలుసుకొని పేదపిల్లలకు తగిన విద్యా అందించాలని పలు స్వచ్చంద సంస్థల దృష్టికి తీసుకెళ్లి వారికి అండగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఎవరు ఎటుబోతే మాకేంటి అనుకునే ఈ రోజుల్లో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారి లాంటివాళ్లు చాలా అరుదుగానే చెప్పుకోవచ్చు.
అనేకులకు అండగా నిలిచి సామాజిక సేవ మరియు సామాజిక స్పృహపై ఆయకార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం సమాజంపట్ల వారి కున్న సామాజిక స్పృహగా పలువురు వారిని అభినందించారు..
ఇది తనకు “ఎలా సాధ్యమని” పలువురు స్నేహితులు అడిగిన దానికి వారు స్పందిస్తూ” సమాజంలో గౌరవం అనేది కొనుక్కుంటే వచ్చేదికాదు.
అలాగని ఇది ఏ ఒక్కరి సొంతంకాదు సాటిమనిషిని మనిషిలా అర్ధం చేసుకొని వారి కష్టాల్లో మన మానవత్వాన్ని చాటేప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే.
మంచిమనసుతో సామాన్యుల పక్షాన నిలిచి తోచిన ఏ చిన్న సహాయం చేసిన వారికి గొప్ప ఆనందాన్ని తృప్తిని ఇస్తుందని చెప్పారు. అవార్డ్స్ రివాడ్స్ అనేవాటిపై దృష్టిపెట్టి లేక ఏదో ఆశించి మనం సమాజానికి సేవచేయకూడదు.
సాటి మనిషిపట్ల మానవత్వంతో మనం చేయాలి అనుకున్న మంచిని చేస్తూ ముందుకెళ్లాలి. తర్వాత మనం ఎదుటివారిపట్ల చూపే కనికరం, ప్రేమ, ఆప్యాయత, జాలీ మనం ఊహించని సమయంలో వాటి అంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని వారు పేరుకున్నారు.
ఈ క్రమంలో వారు మాట్లాడుతూ, నేను కొన్ని సూక్తులు మంచి మాటలు నమ్ముతాను అదే ఏమనగా “నిన్నువలే నీ పొరుగువన్నీ ప్రేమించు” అనే మాట నన్ను ఎప్పుడు సాధ్యమైనంత వరకు సాటి మనిషి అర్ధం చేసుకునేలా సహాయపడుతుంది.
దీన్ని నేను ఒక ప్రామాణికంగా తీసుకునే ప్రయత్నం చేస్తుంటాను.
రెండోవమాట “క్రియలేని విశ్వాసం మృతం” ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే వారి కష్టాల్లో ఎక్కడైన నేను ఉపయోగపడగలనా అని ఆలోచిస్తాను. మన మాటలు ఎదుటి వ్యక్తి కష్టాలు ఎప్పటికి తీర్చలేవు. అందుకే క్రియరూపేణా వారికి సహాయపడే ప్రయత్నం చేయడం నా తత్వమన్నారు.
మూడోవదిగా: “మానవసేవే మాధవసేవ” అనే మాట నాకు చాలా ఇష్టమైన మాట. అందరు మనుష్యులే ఎటువంటి వివక్షలేకుండా తోటి మనిషికి సేవచేసే గుణం ప్రతి ఒక్కరి అవసరమని వారు గుర్తుచేశారు.
దీన్ని సాధ్యమైనంతవరకు అనుసరించే ప్రయత్నం చేస్తాను అన్నారు.
నాలుగోవదిగా: “ప్రార్దించే పెదలకన్నా సహాయం చేసే చేతులు మిన్న”. అనే మాటను అక్షరాల నమ్ముతాను. అవును ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. అనారోగ్యంతో ఉంటే సాధ్యమైనంత వరకు నేను సహాయపడుతూ నలుగురి ద్వారా వారికి సహాయం అందేలా చూడాలి.
బలహీనుడు బలవంతునిచె దొంగిలించబడితే అండగా నిలిచి సహకరించినప్పుడే మానవత విలువలు రేపటితరానికి మనం ఆదర్శంగా నిలువగలమని, రేపటితరానికి మాదిరికరంగా ఉండాలన్న లేక సమాజంలో మానవత్వం బ్రతికి బట్టకట్టాలన్నా నేడు మనం ప్రదర్శించే తీరుపై ఆధారపడి ఉందని భారబరితమైన సామాజిక స్పృహను గురించి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ తన సదేశంలో పేరుకున్నారు.