Telangana
గుండ్లరేవు పంచాయతీ ట్రాక్టర్ బోల్తా

గుండ్లరేవు పంచాయతీ ట్రాక్టర్ బోల్తా.
.. డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్న వార్డు సభ్యులు
సి కె న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండ్లరేవు గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజన్ ఒకవైపు టాంకర్ మరో వైపు పడీ పోవడంతో డ్రైవర్కి గాయాలైనట్లు తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ ఉండటం లేదని వార్డు సభ్యులుఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..