MahaboobabadTelangana

గుడ్ పోలీస్.. నెల్లికుదురు పోలీసులకు ఎస్పి ప్రశంస

గుడ్ పోలీస్.. నెల్లికుదురు పోలీసులకు ఎస్పి ప్రశంస

గుడ్ పోలీస్.. నెల్లికుదురు పోలీసులకు ఎస్పి ప్రశంస..
రివార్డులు ప్రకటించిన శరత్చంద్ర పవార్
రూ. 30 లక్షల గంజాయి.2కార్లు స్వాధీనం..
ప్రధాన నిందితుడు పదారి.. ముగ్గురు అదుపులోకి.

నెల్లికుదురు.. ఎండు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాట వేసి చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను వెరీ గుడ్ నెల్లికుదురు పోలీస్ అని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ప్రశంసించారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వదిలేది లేదని ఎస్పీ హెచ్చరించారు.

స్థానిక పోలీస్ స్టేషన్లో డిఎస్పీ రమణబాబు, సిఐ సత్యనారాయణ,ఎస్ఐ క్రాంతి కిరణ్ లతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ .. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి క్రాస్ రోడ్ వద్ద గురువారం తెల్లవారుజామున 1:00 గంటకు నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు కార్లను పట్టుకున్నారు. రూ 30 లక్షల విలువ చేసే 1.క్వింటా 54 కిలోల ఎండు గంజాయిని, రూ 16 లక్షల విలువ చేసే రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత ఎండు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మండలంలోని వావిలాల గ్రామం బోటి మీద తండా కు చెందిన ప్రధాన నిందితుడు జాటోతు సునీల్ పోలీసులను చూసి పరారీ కాగా , పోలీసులు వెంబడించి సంబంధిత కార్ల డ్రైవర్ల ను ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.వీరు మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన పూజారి నరేష్, చింతల అనిల్ ,అదే జిల్లా కేంద్రానికి చెందిన రెడ్డి బజార్ లోని గుగులోతు వెంకటేష్ లని వెల్లడించారు.

కాగా ఎండు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాటోత్ సునీల్ జల్సా లకు పాల్పడుతూ త్వరగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో భద్రాచలం, సీలేరు ప్రాంతాల నుండి తక్కువ రేటుకు ఎండు గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్ వారికి ఎక్కువ రేటుకు అమ్మేవాడు. ఈ క్రమంలో 2019– 20 లో సంబంధిత సునీల్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా జైలుకు సైతం వెళ్ళాడు అన్నారు. అయినా తన వక్రబుద్ధిని మార్చుకోలేక గత నెల సీలేరు నుండి గంజాయిని తీసుకువచ్చి తన బోటి మీద తండా పొలం పరిసర ప్రాంతాలలో ఉంచి సంబంధిత కారు డ్రైవర్లకు ఫోన్ చేసి కార్లలో తరలిస్తున్న క్రమంలో ఎంతో చాకచక్యంతో పోలీసులు పట్టుకున్నారన్నారు.

పోలీసులకు రివార్డులు అందజేసిన ఎస్పీ:-
అత్యంత చాకచక్యంగా అక్రమ ఎండు గంజాయిని పట్టుకున్న స్థానిక ఎస్సై క్రాంతి కిరణ్ తో పాటు సంబంధిత టీం లోని పోలీసులు కె. వెంకన్న, ఎమ్. యాకయ్య, ఎం. శంకరయ్య, ఎన్. యాకస్వామి, జి. సోమలింగం లను అభినందించారు. వీరికి రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రమణబాబు, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected