
గురుకుల పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థిని ఆత్మ హత్యా ప్రయత్నం
పరామర్శించిన పి.పి.ఎల్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు పప్పుల రమణ
ఖమ్మం ఏప్రిల్ 2, :ఖమ్మం జిల్లా
వైరా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న కడారి దీప్తి తోటి విద్యార్థుల వేదింపులు తట్టుకోలేక అందుబాటులో వున్న మాత్రలు మింగింది. ఆత్మ హత్యకు ప్రయత్నించిన విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడారి. దీప్తి ని ప్రగతిశీల తల్లితండ్రుల సంఘం రాష్ట్రఉపాధ్యక్షులు పప్పుల.రమణ, రాష్ట్రామహిళా కార్యదర్శి ఎల్. మాధవి,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోట అనిత తో కలిసి పరామర్శించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే వుంటుందని,వారికి రక్షణ కల్పించాలని,మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైరా స్కూల్ పేరెంట్స్ కమిటీ గొల్లమందల శ్రీనివాస రావు, ముత్యాల రాజు, నల్లగట్ల రామారావు మరియు స్వేరోస్ జిల్లా కమిటీ అధ్యక్షులు నారపోగు ఉదయ్, గోల్లమందల రాజు కూడా పాల్గోని, దీప్తి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసి తల్లితండ్రులకు ధైర్యం చెప్పి వారికి భరోసా ఇవ్వడం జరిగింది.