
గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి మార్చి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ
- ప్రిన్సిపాల్ రమేష్ బాబు
ఖమ్మం మార్చి 18:
తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఐదవ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 20 వరకు పొడిగించారని టేకులపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు తెలియజేశారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని,ఈ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో సీటు పొందిన విద్యార్థికి ఉచిత భోజన వసతి సదుపాయాలతో పాటు విద్యార్థికి అవసరమగు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు,యూనిఫామ్స్, దుప్పట్లు, కాస్మోటిక్ మరియు వాషింగ్ చార్జీలు, ట్రంకు బాక్స్ మొదలైన సామాగ్రిని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది
కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అలాగే ఈ విషయం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల /కళాశాల, టేకులపల్లి, ఖమ్మం వారు తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు.