
గ్రామీణ పేద విద్యార్థుల విద్యా బాండాగారలే నేటి ప్రభుత్వ గురుకులాలు.
- పి.పి.ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల.రమణ
ఖమ్మం మార్చి 20:
తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్.సి,బి.సి,ఎస్.టి గురుకుల పాఠశాలలలో ఏప్రిల్ 23 న జరుగు ఐదవ తరగతిలో ప్రవేశమునకు జరుగు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (వి – టీజీ సెట్ ) గడువు నేటితో ముగియనుండటంతో, ప్రోగ్రాసీవ్ పేరెంట్స్ లీగ్(పి.పి.ఎల్) రాష్ట్రఉపాధ్యక్షులు పప్పుల.రమణ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామీణ పేద,బడుగు బలహీన విద్యార్థులకు ఈ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జిల్లా కమిటీ ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా ఈ రోజు పాలేరు నియోజకవర్గం లోని ఖమ్మం రురల్ మండలం మరియు కుసుమంచి మండలాల గ్రామాలలోని పాఠశాలలను సందర్శించి ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లోని వసతి, సదుపాయాలు
మరియు సుదీర్ఘ అనుభవం గల ఉపాధ్యాయులచే ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించుటయే కాక విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇప్పించి వారిని నిష్ఠాతులుగా తీర్చిదిద్దిడం జరుగుతుందని నేడు గురుకులాల్లోని విద్యార్థులే రాష్ట్ర,దేశ క్రీడల్లో రాణిస్తున్నారని అంతేకాక కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా మెడికల్, ఇంజనీరింగ్ లలో అత్యధిక సీట్లు సాధించడమే కాక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అజిమ్ ప్రేమజి,ఢిల్లీ మరియు సెంట్రల్ యూనివర్సిటీ లలో సీట్లు సాధించడం జరుగుతుందని తెలియజేసారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామీణ పేద విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్.మాధవి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాతంగి రత్నం,జోనల్ కార్యదర్శి సంగెపు. రామకృష్ణ, అనిత,మరియు జిల్లా కమిటీ నాయకులు విజయకుమార్,నరసింహారావు,చింతలపూడి.కృష్ణ,సునీత,నాగేశ్వరరావు,వేణుగోపాల్ మరియు జిల్లా మరియు మండల నాయకులు,పాఠశాల ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.