Telangana

గ్రేస్ విద్యాసంస్థల చైర్మన్ జాకబ్ వేల కోట్ల అక్రమ ఆస్తులపై సిబిఐ, ఈడి దర్యాప్తు జరపాలి

గ్రేస్ విద్యాసంస్థల చైర్మన్ జాకబ్ వేల కోట్ల అక్రమ ఆస్తులపై సిబిఐ, ఈడి దర్యాప్తు జరపాలి

గ్రేస్ విద్యాసంస్థల చైర్మన్ జాకబ్ వేల కోట్ల అక్రమ ఆస్తులపై సిబిఐ, ఈడి దర్యాప్తు జరపాలి


తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, నరాల సత్యనారాయణ


గ్రేస్ విద్యాసంస్థలను పేదవారిని అడ్డంపెట్టి నడుపుతున్న జాకబ్ ఇతర దేశాల నుండి వందల కోట్ల డబ్బులు తెచ్చి పేద పిల్లలకు ఉచిత భోజనం, చదువు, బట్టలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నా అని వారి పేరు చెప్పి వేల కోట్లు ఆర్జించి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాలలో బినామీల పేరుతో వేలకోట్లు సంపాదించి, వేల కోట్లకు పడగలెత్తి రాజ్యమేలుతున్న అవినీతిపరున్ని సిబిఐ, ఈడి అరెస్టు చేసి విచారణ జరిపితే అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నది.


ప్రపంచ దేశాల నుండి, ప్రసిద్ధిగాంచిన వ్యక్తులను ఇండియాకు తీసుకురావడం, వారికి ఇక్కడ పిల్లలను ఫోటోలను చూపించడం, వాటి ద్వారా వేలకు వేల కోట్లు సంపాదించి బినామీల పేరుతో అక్రమ ఆర్జన చేసి న గ్రేస్ విద్యా సంస్థల జాక బ్ పై పూర్తి విచారణ జరిపించాలని, ఢిల్లీ వెళ్లి సిబిఐకి, ఈడి కి,ఈనెల 29వ తారీఖున కంప్లైంట్ చేయడం జరుగుతుందని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు


జాకబ్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపితే వేలకోట్ల ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నది, కావున జాకబ్ పై, అతని అనుచరులపై, అతని బినామీలపై సమగ్ర విచారణ జరిగేదాకా రాజీలేని పోరాటం చేస్తామని, ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని నరాల సత్యనారాయణ తెలియజేశారు


ఒక సామాన్యుడు కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొనడం, ఇతర దేశాలకు వెళ్లి కోట్ల రూపాయల పండింగులు సేకరించడం, ఇతర దేశాల నుండి వివిధ ఎకౌంట్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ఇండియాకు తరలించడం జరిగినదని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని, జాకబ్ ను అరెస్టు చేసేదాకా తమ పోరాటం ఆగదని, అతని ఆస్తులను ఈడి జప్తు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు


తనికెళ్ల, పెద్ద తండా, మణుగూరు లలో వందల కోట్ల భూములు ఉంటే, మిగతా జిల్లాలలో , మిగతా రాష్ట్రాలలో ఎన్ని వేల కోట్లు అక్రమ సంపద ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.


అందుకే మే నెల 29వ తారీఖున ఢిల్లీ వెళ్లి సిబిఐ , ఈడి నీ కలిసి, అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కూడా కలిసి దర్యాప్తు చేయవలసిందిగా కోరుతామని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected