
ఘనంగా సర్పంచ్ మారెళ్ళ మమత కుమారుడు శ్రీరామకృష్ణ జన్మదిన వేడుకలు..
గ్రామంలో అన్ని అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు బ్యాగులు పంపిణీ..
సికే న్యూస్ ప్రతినిధి
*తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, మల్లికార్జున రావు దంపతుల కుమారుడు శ్రీరామకృష్ణ జన్మదిన వేడుకలను గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు మారెళ్ళ లక్ష్మణరావు, ఐసీడీఎస్ సిడిపిఓ కృష్ణకుమారి తదితరులు కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం గ్రామంలోని 8 అంగన్వాడి సెంటర్లలో ఉన్న సుమారు 150 మంది చిన్నారులకు బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న శ్రీరామకృష్ణకు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామంలో పార్టీలకతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, 8 అంగన్వాడి సెంటర్లలో ఉన్న టీచర్లు, తల్లులు, చిన్నారులు రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ హానీబున్నీసా బేగం, ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, సెక్రెటరీ వేణు, హెచ్ఎంలు రమేష్, సరోజినీ, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.