
చర్ల పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ జీ. వినీత్.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
మే 03,
మడకం సోన, మడకం జోగి వీరిద్దరూ భార్య భార్యలు. వీరు అనేక సంవత్సరాలుగా మావోయిస్టు నాయకులుగా పనిచేస్తూ,
ఈ మధ్యకాలంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ చేయుత కౌన్సిలింగ్ కు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమైనట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జీ. వినీత్ తెలిపారు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గి పస లేకపోవడంతో అందులోని పార్టీ నాయకులు అంతా పోలీస్ ల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమైతున్నట్లు ఎస్పీ తెలిపారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని ప్రతిఫలాలను యిప్పిస్తామని అన్నారు.
మావోయిస్టు నాయకులంతా ఇప్పటికైనా కళ్ళు తెరిచి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.