
చర్ల మండలంలో మరో రెండు అగ్ని ప్రమాధాలు.
నివారణ చర్యలు పై ద్రుష్టి పెట్టని అధికారుల నిర్లక్ష్య వైఖరి నాసించాలి..
రెండు అగ్నిప్రామాదాలు జరిగినా చర్ల మండలానికి రాని ఫైర్ డిపార్ట్ మెంట్…
అగ్ని ప్రమాధ బాధితుల ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణ ఆర్ధిక సాయం అందించాలి ..
అగ్ని ప్రమాధ బాధితులు వంకాయల శ్రీను కుటుంబ్బీకులను పరామర్శించి చిరు సాయాన్ని అందించిన సి పి ఐ ఎం ఎల్ ప్రజాపందా పార్టీ….
చర్ల మండలo లో ఫైర్ స్టేషన్ న్ని నిర్మించాలి …
సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కమిటీ
సీకే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 02,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో బుధవారం రెండు అగ్ని ప్రమాధాలు జరిగాయి గంపేనగూడెం గ్రామంలో గడ్డివాము , సి ఆర్ కాలనీలోని వంకాయల శ్రీను ఇళ్ళు అగ్నికి ఆహుతి అయ్యింది. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించి చిరు సాయాన్ని పార్టీగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ రెక్కల కష్టంపై ఆదారపడి జీవించే శ్రీను కుటుంబానికి అగ్నిప్రమాదం చేసిన నష్టం ఎవ్వరు పుడ్చలేనిదని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తక్షణ ఆర్ధిక సహకారన్ని ప్రభుత్వం అందించాలని డబుల్ బెడఁరూం ఇళ్ళు కట్టి ఇవ్వాలని జరిగిన నష్టాన్ని గుర్తించి 3లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు
జరుగుతున్న అగ్ని ప్రమాధాల పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించడం మంచిది కాదని మండిపడారు చర్లలో ఫైర్ ఇంజన్ ఉండి ఉంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఫైర్ స్టేషన్ న్ని చర్ల మండలంలో యార్పాటు చేసేదానికి కృషి చెయ్యాలని అన్నారు సర్వం కోల్పోయిన ఈ కుటుంబానికి సేవాదృక్పధం కలిగిన చర్ల మండల ప్రజాణికం ప్రముఖులు మేధావులు స్వచ్చoద సేవాసంస్థలు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు నాయకులు ఆర్ధిక హార్దిక సహకారం అందించి అండగా నిలవాలని కోరుకుంటున్నాము
ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ నాయకులు మునిగల శివ, గ్రామస్థులు శ్రీను కిరణ్, రాగవయ్య, నిరంజన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.