చిన్నారి మృతితో వైద్య సిబ్బంది హే అలర్ట్

తేజస్విని మృతితో వైద్య సిబ్బంది హే అలర్ట్ మండలంలో సూపర్డెంట్ పర్యటన
“ములుగు జిల్లా సి కె ప్రతినిధి భార్గవ్”
చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది,,,,?
నుగుర్ వెంకటాపురం మండల కేంద్రం పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో పాముకాటుకి గురైన కసడపు తేజస్విని ప్రాణత్యాగం ఒట్టిపోలేదు సరైన వైద్యం అందక కాలం చెల్లినటువంటి తేజస్విని దేహంతో రాస్తారోక్ నిరసనకు దిగిన తల్లితండ్రులు సికే న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ నా బిడ్డకు జరిగిన నిర్లక్ష్యం మరియు అన్యాయం ఏ బిడ్డకు ఏ అనారోగ్య వాదికి జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతో నే నిరసనకు దిగామని తెలిపారు ఈ విషయం పట్ల ప్రజా ప్రతినిధులు వైద్య శాఖ అధికారులను ఏరియా గవర్నమెంట్ హాస్పటల్ నిర్లక్ష్య పనులను వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ మీడియా ద్వారా డిమాండ్ చేసిన అంశాలపై హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ స్పందించారు హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ ప్రజలతోనూ ప్రజా ప్రతినిధులతోనూ మాట్లాడుతూ ఇటీవల వెంకటాపురం మండలం ప్రభుత్వ దవఖానా నుంచి అనేక రూమర్స్ వస్తున్నాయని మెయింటినెన్స్ లోపాల వలనే ఇలా జరుగుతుందని ఇకనుంచి ఇలాంటి సమస్యలు ఏమి ఉండవని మెరుగైన సాంకేతిక మిషనరీలతో అధిక వైద్య సిబ్బందితో రిఫర్ అనే వ్యవస్థ పూర్తిగా అంతరించిపోయే విధంగా, తెలంగాణ ప్రభుత్వం వెంకటాపురం మండలం మరియు కొన్ని మండలాల్లో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో నిధులను కేటాయించేందుకు నిర్ణయం తీసుకుందని ఇవి అమలులోకి రావాలంటే కొంచెం కాల వేదవి పడుతుందని హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ తెలిపారు ఈ కార్యక్రమ సమావేశంలో ప్రజా ప్రతినిధులు వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ మార్కెట్ కమిటీ సభ్యులు చీడెం మోహన్ రావు పాత్రికేయులు మండల వైద్య సిబ్బంది పాల్గొన్నారు..