
చెరువును తలపిస్తున్న పాపకొల్లు గ్రామపంచాయతీ మెయిన్ రోడ్డు.
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామపంచాయతీ లోని పాపకొల్లు టు అన్నారుపాడు క్రాస్ రోడ్ వద్ద చెరువును తలపిస్తున్న ప్రధాన కూడలి రోడ్డు. వేసవికాలంలో ఒక్కసారి కురిసిన వర్షానికే ఈ రోడ్డు ఇలా నీళ్లమయమైతే, వర్షాకాలంలో ఈ రోడ్ల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి, ప్రజా ప్రతినిధులు, నాయకులు,అధికారులు మేము ఆ పని చేశాము ఈ పని చేశాము అని పత్రిక ప్రకటన ఇస్తారు కానీ, మేము ఈ పని చేయలేదు అని ఏనాడైనా పత్రిక ప్రకటన ఇచ్చారా. శిలా పథకాలు శంకుస్థాపన చేయడం ఫోటో దిగడం వదిలేయడం. పట్టించుకునే నాధుడే ఉండడు, ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే, గెలవక ముందే నా తల తాకట్టు పెట్టి ఆ పని చేయిస్తా ఈ పని చేయిస్తానని వాగ్దానాలు, గెలిచాక వీళ్ళతో నాకు పని ఏంటి అన్న మాదిరిగా ప్రవర్తన, స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాము, ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, మన బ్రతుకులు మారేది ఎన్నడు.