Telangana

జబర్దస్త్ కమెడియన్ చాలకి చంటి కి తీవ్ర అస్వస్థత

చాలకి చంటి కి తీవ్ర అస్వస్థత
ఆసుపత్రికి తరలింపు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన చలాకీ చంటి ( Chalaki Chanti )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
జబర్దస్త్ షోలో కామెడీ చేసి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చంటి. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతోపాటు కమెడియన్ గా కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు జబర్దస్త్( Jabardast ) లో కమెడియన్ గా చేసిన చంటి ఆ తర్వాత కొద్ది రోజులు జబర్దస్త్ మానేసినప్పటికీ ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు ఈవెంట్ లకు యాంకర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా మొన్నటి వరకు జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company )షోలో సందడి చేసిన చంటి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు.

దీంతో కొందరినీటిజన్స్ చలాకీ చంటి కి ఏమయింది అని సెర్చ్ చేయగా ఆరోగ్యం బాగోలేదు అని తెలియడంతో అసలు చంటికీ ఏమయ్యింది? అభిమానులు కలవర పడుతున్నారు. అయితే చలాకీ చంటి ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలను మొదట్లో ఎవరూ నమ్మలేదు. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చలాకీ చంటి ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సీరియస్ హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన కండిషన్ ప్రస్తుతం సీరియస్ గానే ఉందట.

ఎప్పుడు తన చలాకీతనంతో అందరినీ నవ్వించే చంటి ఇలా చిన్న వయసులో ఇలా ఆసుపత్రిలో చేరడం ఫ్యాన్స్ కి, కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయం ఇది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చంటి తొందరగా కోలుకొని ఎప్పటిలాగే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాలి అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected