జర్నలిస్టుల అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలి

జర్నలిస్టుల అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలి
-ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన టీజేఎఫ్ నాయకులు.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
మే 09,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, అపరిస్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ…. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యు జె , టీ జె ఎఫ్ రాష్ట్ర నాయకులు తోటమల్ల బాలయోగి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకి వినతి పత్రం అందజేశారు.
హైదరాబాదు లో ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఇప్పటికే అనేకమంది జర్నలిస్టులు చాలా రోజుల క్రితం అక్రిడేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని ఉన్నారని, త్వరలోనే కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా జిల్లాలో అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇవ్వబోయే ఇళ్ల స్థలాలను త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కోరారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యు జె , టీ జె ఎఫ్ నాయకులు గుమ్మడపు దుర్గాప్రసాద్, పూనెం ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు