జర్నలిస్ట్ బందు అమలు చేయాలి

వరంగల్ ఉమ్మడి జిల్లా
జర్నలిస్ట్ బందు అమలు చేయాలి
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలి.
దళిత బందులో దళిత జర్నలిస్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
అక్రిడిడేషన్ లేని జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు వర్తింప చేయాలి.
మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ఇండియా తెలంగాణ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేయడం జరిగింది.
సోమవారం రోజు ఎన్.ఎస్.ఆర్ హోటల్ గూడెప్పాడ్ లో తెలంగాణ జర్నలిస్టుల ప్రధమ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అపరాతి నాంపల్లి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ మేడ శ్రీనివాస్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వి, సదానంద రెడ్డి, మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ ఇసంపెల్లి వేణు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం జన్ను ప్రమీల, నేషనల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ తదితర ప్రముఖులు పాల్గొనీ వారు మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో వివిధ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల శ్రమను గుర్తించి వారి ఆర్థిక ఇబ్బందులను పరిగణంలోకి తీసుకొని పాత్రికేయ కుటుంబాలకు తోడ్పాటుగా జర్నలిస్టు బందు రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని, ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టు బందు అమలు చేసే లోగా దళిత బందులో దళిత జర్నలిస్టులకు తొలి ప్రాధాన్యత కల్పించాలని ఆ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు నిత్యం కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు పనిచేస్తున్న మీడియా సంస్థల నుంచి కనీస జీతభత్యాలు లేకున్నప్పటికీ సామాజిక సేవా దృక్పథంతో జర్నలిస్టులు తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ అందరికీ అందడం లేదన్నారు మీడియా సంస్థలు విలేకరులకు ఇచ్చే గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం అక్రిడిడేషన్ ఇచ్చేలా నిబంధనలో మార్చాలని వారు సూచించారు.
అక్రిడిడేషన్ జారీలో జరుగుతున్న పొరపాట్లను కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. అక్రిడిడేషన్ల జాబితా జిల్లా డిపిఆర్ఓ కార్యాలయాల బోర్డులపై పెట్టాలని కోరారు. అలాగే జర్నలిస్టుల అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకుని అక్రిడేషన్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్రిడిడేషన్లు లేనివారికికూడా ప్రభుత్వపరమైన అన్ని రకాల సౌకర్యాలు వర్తింప చేయాలని, జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అనే భరోసా కల్పించాలని అన్నారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్క గృహాలు నిర్మించాలని చిన్న పెద్ద తారతమ్యం లేదనీ నిజాలు రాసే వారంతా జర్నలిస్టులేనని పిలుపునిచ్చారు.
సమస్యల సాధన కోసమే మీడియా అకాడమీ ఫెడరేషన్ పోరాడుతుందని జర్నలిస్టు పిల్లలకు కేజీ నుండి పిజీ వరకు ఉచిత విద్య అందించాలనీ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు గాను ఆత్మ రక్షణ కోసం లైసెన్స్ గన్నులు జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే జీవో అమలు చేసి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మీడియా అకాడమీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక
గౌరవ అధ్యక్షులు
వి, సదానంద రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
అపరాతి నాంపల్లి యాదవ్
వర్కింగ్ ప్రెసిడెంట్
పెండ్యాల సుమన్
వైస్ ప్రెసిడెంట్
కొలగాని సురేష్
వైస్ ప్రెసిడెంట్
శ్యామ్
ప్రధాన కార్యదర్శి
కన్నూరి సమ్మయ్య
కార్యదర్శి
భోగే సంజీవ
కార్యదర్శి
కుర్రి ఏలియా
క్రమ శిక్షణ కమిటీ చైర్మన్
కొండ కుమారస్వామి
20 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.