
జర్నలిస్ట్ లకు పెండింగ్ అక్రిడిటేషన్లు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 10,
జర్నలిస్ట్ లకు పెండింగ్ అక్రిడిటేషన్లు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా, అధ్యక్ష, కార్యదర్శులు పుదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కలిసి వినతి పత్రం అందచేశారు.
రెండవ విడత అక్రిడిటేషన్లు కార్డులు పెండింగ్ లో ఉండి చాలా కాలం అవుతుందని… వెంటనే జారీ చేసే విధంగా కలెక్టర్ చొరవ చూపి పెండింగ్ అక్రిడిటేషన్లు కార్డులు ఇప్పించాలని వారు కలెక్టర్ కు వివరించారు.
అదేవిధంగా ప్రభుత్వం ఇస్తానన్న జర్నలిస్ట్ లకు ఇంటిస్థలాలు సమస్య పై వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం, మండలాల స్థాయిలలో పని చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు గుర్తించి హక్కు పత్రాలు ఇవ్వాలని వారు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు.
కలెక్టర్ అనుదీప్ స్పందిస్తూ.. జర్నలిస్ట్ ల సమస్యలు వీలైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు, వెలమ రాజేందర్, పర్సబోయిన రాధకృష్ణ, ములకలపల్లి గోపినాథ్, గొడ్డుగొర్ల నాగరాజు, రామదాసు, రబ్బాని, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.