
నేడు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ ఠాను నాయక్ 73వ వర్ధంతి కార్యక్రమం
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సేవలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ భూమి కోసం ,భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన లంబాడీల ముద్దుబిడ్డ జటోత్ ఠాను నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి జనగామ జిల్లా ధర్మపురం పడమటి తండా కు చెందిన హాము నాయక్ మంగ్లీ బాయ్ దంపతుల నాలుగవ సంతానం. నాడు ఉద్యమకారులు తలదాచుకోవడానికి ఊరికి దూరంగా ఉన్న లంబాడీల తండాలలో దాచుకునేవారు అప్పటి పోలీసులు తండాలకు వెళ్లి చిన్న పిల్లలను మహిళలను చిత్రహింసలు పెట్టినా కూడా వారి జాడ చెప్పకపోయేవారు. లంబాడి సింహం జాటోత్ ఠాను నాయక్ పడమటి తండాలో 85 ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చిన గొప్ప మహానుభావుడు ,అటువంటి ఠాను నాయక్ ను మండ్రయి దగ్గర తండాలో అందరూ చూస్తుండగా ఎడ్ల బండికి కట్టివేసి 1950 మార్చి 20వ తేదీన ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపడం జరిగింది. చావుకు భయపడకుండా ఎదురోడ్డీ పోరాడినటువంటి అమరుడు ఠాను నాయక్ ఆశయాలను సాధిస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై ఠాను నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు ఠాను నాయక్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుందని అన్నారు అలాగే మానుకోటలోని కోర్టు సముదాయం ముందు ఠాను నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకావత్ పద్మాబాయి .పట్టణ అధ్యక్షులు బోడ దిలీప్ నాయక్, పట్టణ కార్యదర్శి గుగులోత్ మాలు నాయక్ వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జి గుగులోత్ రాములు నాయక్, బొడ సుమన్ నాయక్, రవికుమార్ నాయక్ మోహన్ నాయక్, భీముడు నాయక్, వాలియా నాయక్, పాల్గొన్నారు