Telangana

జీతాలే ఇయ్యలేనోడు… వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొంటాడా?

జీతాలే ఇయ్యలేనోడు… వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొంటాడా?

-వైజాగ్ స్టీల్ తరువాత… బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతానన్న హామీ ఏమైంది?

-కన్నతల్లకి అన్నం పెట్టలేనోడు… పిన్నతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్లుంది.

బిచ్చమెత్తుకునే స్థాయి నుండి వేల కోట్లు ఎట్లా సంపాదించారు?

దమ్ముంటే వరంగల్ సీపీ కాల్ లిస్ట్ ను బయటపెట్టాల్సిందే

వరంగల్ సీపీ అవినీతి, అక్రమాల బండారం బయటపెడతా

ఆయనపై పరువు నష్టం దావా వేస్తా

నేనేమైనా టెర్రిరిస్టునా… నా బెయిల్ ఎందుకు రద్దు చేయాలి?

ఈటల రాజేందర్ ఏం తప్పు చేశారని నోటీసులిస్తారు?

మనీ సంబంధాలే తప్ప మానవ సంబంధాల్లేని మూర్ఖుడు కేసీఆర్

రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి, మా అత్తమ్మ పక్షిముట్టే కార్యక్రమాలను జరగనీయకుండా ఇబ్బందికి గురిచేసిన నీచుడు

బలగం సినిమా చూపిస్తేనైనా కనువిప్పు కలుగుతుందేమో

డైరెక్టర్ వేణుసహా బలగం సినిమా యూనిట్ కు హ్యాట్సాఫ్

-రాష్ట్ర ప్రభుత్వంపై మరోమారు నిప్పులు చెరిగిన బండి సంజయ్

‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EVI) బిడ్డింగ్ లో పాల్గొంటానడం చూస్తే నవ్వొస్తుంది. ఫస్ట్ నాడు సక్రమంగా జీతాలే ఇయ్యలేనోడు, రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతిసహా ఇచ్చిన హామీలను అమలు చేయలేనోడు వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడతాడట. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు… పిన్నతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్లుంది. దాని సంగతి తరువాత… బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నయ్ కదా.. ఏమైంది? నీకు దమ్ముంటే బయ్యారం స్టీల్ ను ఏర్పాటు చేయ్’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడ్డారు. ‘‘నేనేమైనా టెర్రరిస్టునా? నక్సలైట్ నా? సీఎం కొడుకు, బిడ్డలెక్క లంగ, దొంగ దందాలు చేసి వేల కోట్లు సంపాదించానా? నా బెయిల్ ఎందుకు రద్దు చేస్తారు?’’అని మండిపడ్డారు. వరంగల్ సీపీ అవినీతి, అక్రమాల చిట్టాను త్వరలోనే బయపెడతానని చెప్పారు. ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. వరంగల్ సీపీకి చిత్తుశుద్ధి ఉంటే ఆయన ఫోన్ కాల్ లిస్ట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్, సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, లంకల దీపక్ రెడ్డిసహా పలువురు బీజేపీ నేతలతో కలిసి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద దేవి థియేటర్ లో ‘‘బలగం’’ సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా తలచాలి, కొలచాలనే ఆలోచన లేకుండా పోతున్న ఈరోజుల్లో తరువాత 11 రోజులతలపాటు దావత్ చేసుకోవడం, బాధపడటానికే పరిమితమైన ఈ రోజుల్లో చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా కొలవాలి? తలచాలనే భావన సినిమా తీసి మానవ సంబంధాలు, కుటుంబ బంధాల గురించి అద్బుతంగా చెప్పిన డైరెక్టర్ వేణుకు నా హ్యాట్సాఫ్.

• కలెక్షన్లు, పబ్లిసిటీ కోసం చూడకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి మంచి సందేశాన్ని అందించేందుకు యత్నించిన దిల్ రాజుసహా సినిమా యూనిట్ కు నా ప్రత్యేక అభినందనలు. థియేటర్ కు వచ్చి చూడటం ద్వారా సినిమా పరిశ్రమకు బలాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి సినిమా చూశాను.

• సీఎం కేసీఆర్ కు మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాల్లేవు. గతంలో రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి సమయంలో చాలా ఇబ్బంది పెట్టారు. మొన్న మా అత్తమ్మ చనిపోతే పక్షి ముట్టే కార్యక్రమానికి వెళితే అకారణంగా, అన్యాయంగా అరెస్ట్ చేయించి దుర్మార్గుడు కేసీఆర్.

• 317 జీవోతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి పసిపిల్లల ముందు తల్లిదండ్రులపై లాఠీఛార్జ్ చేయించిన మూర్ఖుడు కేసీఆర్. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా పట్టించుకోని మూర్ఖుడు కేసీఆర్.

• బెయిల్ రద్దు చేయాలని పోలీసులు చెప్పడంలో సంచలనమేముంది? వాళ్లు రబ్బర్ స్టాంపులు. సీఎంఓ నుండి వచ్చే ఆదేశాల ప్రకారమే చేస్తున్నారు కదా…. అయినా నా బెయిల్ ఎందుకు రద్దు చేయాలి? నేనేమైనా టెర్రిరిస్టునా? నక్సలైట్ నా? కేసీఆర్ బిడ్డ, కొడుకు లెక్క లంగ, దంగ చేసి వేల కోట్లు సంపాదించానా? బిచ్చపు బతుకు బతికిన కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పాడు. ఆ సొమ్మనంతా దేశంలోని ప్రతిపక్షాలన్నింటికీ ఇస్తాడట. ఆ సొమ్ము ఎవడిది? నీ అబ్బ సొమ్మా?

• ఈటల రాజేందర్ కు ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఆయన చేసిన తప్పేముంది? దమ్ముంటే ఆధారాలు చూపించు. మాట్లాడితే ఫోన్ అంటున్నారు. కరీంనగర్ లో నన్ను అరెస్ట్ చేసినప్పటి నుండి సిద్దిపేట వరకు ఫోన్ ఉంది. నా పీఏ, నేను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నం. ఫోన్ ను వాళ్లే తీసుకుని నాటకాలాడుతున్నరు. నా ఫోన్ ను సీఎం చూసిన తరువాత చక్కెరొచ్చి పడిపోయిండట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల కాల్ లిస్ట్ చూసి ఇంతమంది టచ్ లో ఉన్నారా? అని విస్తుపోయింది.

• వరంగల్ పోలీస్ కమిషనర్ భాగోతమంతా తీస్తున్నా. విజయవాడ సత్యబాబు కేసు మొదలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సంపాదించిన ఆస్తులు, అక్రమాలన్నీ వెలికితీస్తున్నా. అమాయకులపై కేసులు పెట్టి, సంబంధం లేని వ్యక్తులను రిమాండ్ కు పంపడానికి నీకు ఎవరు అధికారమిచ్చారు? నీకు దమ్ముంటే నీ ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టు. నువ్వు సీఎంతో, మంత్రులతో ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు ఈ కేసు గురించి మాట్లాడినవో తెలుస్తుంది.

• వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EVI) బిడ్డింగ్ లో పాల్గొంటారట. ట్విట్టర్ టిల్లు నిన్న కేంద్రానికి లేఖ రాసినట్లు ఇయాళ పేపర్ల చూసిన. ఆంధ్రోళ్ల బిర్యానీ పెండ లెక్క ఉన్నదన్నడు. ఆంధ్రోళ్లు మా సొమ్మునంతా దోచుకున్నరని చెప్పినోడు ఇయాళ విశాఖ స్టీల్ బిడ్డింగ్ లో ఏ ముఖం పెట్టుకుని పాల్గొంటవ్?

• రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించినోడు.. ఉద్యోగాలకు జీతాలే ఇయ్యలేనోడు…. ఇచ్చిన హామీలే అమలు చేయలేనోడు… నిరుద్యోగ భ్రుతి ఇవ్వలేనోడు, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం చేతగానోడు, రైతు బంధు నిధులు ఇవ్వలేనోడు పక్క రాష్ట్రంలోనున్న వైజాగ్ స్టీల్ ను కొంటాడట. సిగ్గుండాలే… కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు…పినతల్లికి బంగారు గాజులు తొడిగిస్తాననన్నట్లుంది కేసీఆర్ యవ్వారం.

• ప్రభుత్వం దగ్గర నిధులుంటే… నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని హామీ ఇచ్చినవ్ కదా… సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపిస్తానన్నవ్ కదా? కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీని తెరింపిచ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తానన్నవ్ కదా? ఆ పనెందుకు చేయడం లేదు? వాటిని తెరిపిస్తే వేలాది మందికి ఉద్యోగాలు.. ఉపాధి కలుగుతుంది కదా?

• మొన్నటిదాకా ఆంధ్రోళ్ల బిర్యానీ పెండలెక్క ఉన్నదంటివి? ఆంధ్రోళ్లను ఉరికించి ఉరికించి కొడతానంటివి? తెలంగాణ పైసలన్నీ ఆంధ్రోళ్లే దోచుకుపోయారంటివి? నిన్నటిదాకా అవమానించిన ఆంధ్రోళ్లపట్ల అంత ప్రేమ ఎందుకొచ్చింది? ఉత్తరాంధ్రలోనున్న వైజాగ్ స్టీల్ పట్ల అంత ప్రేమ ఎందుకు?

• సింగరేణిని వేల కోట్ల సొమ్మును దోచుకుని సంస్థను దివాళా తీయించి ఫిక్స్ డ్ డిపాజిట్లను తీసి జీతాలిచ్చే దుస్థితికి తీసుకొచ్చిన కేసీఆర్ 20 వేల ఉద్యోగాలను తొలగించిన మూర్ఖుడు. ఇయాళ సింగరేణి ద్వారా బిడ్డింగ్ పాల్గొంటామని సిగ్గులేకుండా చెబుతున్నడు.

• కేసీఆర్… మీ దగ్గర నిజంగా అన్ని పైసలుంటే…. 2018 ఎన్నికల్లో ఏం చెప్పినవ్? కేంద్రం పెట్టినా పెట్టకపోయినా బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ పెడుతుంది. 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చినవ్ కదా… నాలుగేళ్లయింది. మరి బయ్యారంలో ఇంతవరకు స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? 20 వేల మందికి ఉద్యోగాలెందుకియ్యలేదు? నీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకో. లేదంటే నువ్వు చేస్తుందంతా డ్రామాయే… తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెంచుకున్నట్లే… టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ డ్రామాను దారి మళ్లించేందుకే కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది.

• మంచిగున్న సంస్థలను మూసివేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మూసివేసిన సంస్థలను తెరిపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరించడమే ఇందుకు నిదర్శనం. వేల కోట్ల నిధులు కేటాయించి తెలంగాణను అభివ్రుద్ధి చేస్తుంటే రాకుండా అభివ్రుద్ధిని అడ్డుకుంటున్న మూర్ఖుడు కేసీఆర్…

• అసలు నేనడుగుతున్నా… కేసీఆర్… తెలంగాణ ప్రజలు చెమట, రక్తం చిందించి కడుతున్న పన్నుల పైసలను పంజాబ్ కు పంచుతున్నవ్? ఇప్పుడేమో ఆంధ్రాలోని స్టీల్ ఫ్యాక్టరీకి పైసలు పెడతానంటున్నవ్? నీ అయ్య జాగీరానుకున్నవా? ఏమనుకుంటున్నవ్? బిడ్డా… తెలంగాణ ప్రజల నిన్ను ఉరికించి ఉరికించి కొట్టే రోజులు రాబోతున్నయ్…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected