Telangana

జూన్ 21 లోగా వీఆర్ఏ లకు వివిధ శాఖలకు బదిలీ

జూన్ 21 లోగా వీఆర్ఏ లకు వివిధ శాఖలకు బదిలీ

జూన్ 21 లోగా వీఆర్ఏ లకు వివిధ శాఖలకు బదిలీ

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

దశాబ్ద ఉత్సవాలకు గ్రామాలు సన్నద్ధం కావాలి

భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్ట విత్తనాలు

ఆడబిడ్డలకు చీర బహూకరించి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు.

వీఆర్ఏలకు జూన్ 21 లోగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేయనుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. వేంసూరు సహకార సంఘం ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేపట్టారు. అనంతరం మండల కార్యాలయాల ఆవరణలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చి రొట్ట విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. భూసారాన్ని పెంపొందించుకొనేందుకు పచ్చిరొట్ట విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. వేంసూరు మండలంలో 150 కోట్ల రూపాయలకు పైగా ఆరు నెలల కాలంలో అభివృద్ధి నిర్వహించినట్లు పేర్కొన్నారు.

జూన్ 2 వ తేదీ 23వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ ప్రభుత్వ ఆవశ్యకతను వివరించాలని విజ్ఞప్తి చేశారు. సొంత స్థలాల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకొనేందుకు లబ్ధిదారుల సిద్ధంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, డిసిసిబి జిల్లా డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, చైర్మన్ వాసు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, జిల్లా టెలిఫోన్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మిరియాల ప్రసాద్, సర్పంచ్ ఫైజుద్దీన్, ఎంపీటీసీ సభ్యులు నాయుడు వెంకటేశ్వరరావు, ఆప్షన్ సభ్యులు రహీం, తహసిల్దార్ నారాయణమూర్తి, ఎంపీడీవో రమేష్, మండల పంచాయతీ అధికారి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected