మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళ వైద్యం కోసం 5000/– ఆర్థిక సహాయం

మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళ వైద్యం కోసం 5000/– ఆర్థిక సహాయం
ఏజెన్సీలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరవలేనివి, అభినందనీయం— ఎస్సై మధు ప్రసాద్
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 10,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండలం, చర్ల గ్రామానికి చెందిన మహిళ తాటి సమ్మక్క అత్యవసర పరిస్థితుల్లో ప్రసవం కోసం భద్రాచల పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినది. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ కావడంతో మహిళ వైద్యం కోసం 5000/– వేల రూ” మదర్ తెరిసాను ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ ఎస్సై మధు ప్రసాద్ చేతులు మీదుగా మహిళలకు అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్సై మధు ప్రసాద్ మాట్లాడుతూ ఏజెన్సీలో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరువలేనివి, అభినందనీయం అని అన్నారు. మహిళ వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించినందుకు ట్రస్ట్ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మన వంతు సహాయం అందిద్దామని ఎప్పుడు అడిగినా కూడా మా ట్రస్ట్ సభ్యులు మేమున్నామంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ నా వెన్నంటే ఉంటు నన్ను నడిపిస్తున్న మా సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల.మురళి, సంపత్ , నాగరాజు, సాయి, చైతన్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.