Telangana

జేపీస్ లకు సి ఎస్ షాక్

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు షాక్

సమ్మె చేసేవారి ప్లేస్లో కొత్తవారిని నియమించండి: సీఎస్

TS: జేపీఎస్ల సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీఎస్లను చర్చలకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నవారి జాబితాను రేపు మధ్యాహ్నం లోపు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ఎలాంటి సంబంధం ఉండదని, విధులకు హాజరుకాని వారిస్థానంలో తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు. గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దని సూచించారు.

ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని.. సీఎం కెసిఆర్ మనసున్న మహారాజ పంచాయతీ కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆ పేరును చెడ గొట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పన్నారు. JPS లు సమ్మె విరమిస్తే, సీఎం వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం చట్ట విరుద్ధం.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని స్పష్టం చేశారు. సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్ల కు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారని ఎర్రబెల్లి గుర్తు చేశారు.

మీరు రాసిచ్చిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదు .. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న వెంటనే ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. మీరు నాతో ఫోన్ ద్వారా మాట్లాడారు. మీరు మీ సమస్యలు చెప్పుకున్నారు .. మీరు సమ్మె విరమించాలని నేను సూచించాను. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మె ను వివరించాలి. విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హితవు తో కూడిన సూచన, విజ్ఞప్తి చేశారు.

సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లు ఇలా ఏమిటంటే ?

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ 6.0 జీవో విడుదల చేయాలి.

గడిచిన 4 సంవత్సరాల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలి.

ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ JPS లు గా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబెషనరీ పిరియడ్లో భాగంగా పరిగణించాలి. వారిని కూడా రెగ్యూలర్ చేయాలి.

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ధారించి ప్రకటించాలి

మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకో వాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected