
డాక్టర్ ప్రీతి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరపాలి
ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, కౌన్స్లింగ్ కేంద్రాలను, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలి
*ఐద్వా,డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్సులు మాచర్ల.భారతి, షేక్.బషీరుద్దీన్ డిమాండ్*.
*డి.వై.యఫ్.ఐ,ఐద్వా సంఘం ఆధ్వర్యంలో ర్యాగింగ్ భూతం దిష్టిబొమ్మ దహనం*.
సీకే న్యూస్ ప్రతినిధి:
ఖమ్మం(ఫిబ్రవరి 28):డాక్టర్ ప్రీతి ఆత్మహత్య మృతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరపాలని,ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, కౌన్స్లింగ్ కేంద్రాలను,టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని ఐద్వా,డి.వై.యఫ్.ఐ జిల్లా కార్యదర్సులు మాచర్ల.భారతి, షేక్.బషీరుద్దీన్ లు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
డాక్టర్ ప్రీతి మృతికి సంతాపాన్ని తెలుపుతూ కుటుంబాన్ని ఆదుకోవాలని తదితర డిమాండ్స్ తో స్థానిక యన్. యస్. పి క్యాంప్ రోడ్ లో డి.వై.యఫ్.ఐ,ఐద్వా ఆధ్వర్యంలో ర్యాగింగ్ భూతం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.అనంతరం డి.వై.యఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల. ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి మృతి చందడం చాలా బాధాకరమని,వారి కుటుంబాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు తెలిపారు.సైఫ్, సినీయర్ల ర్యాగింగ్ కి తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని,కళాశాల యాజమాన్యానికి చెప్పిన పాటయించుకోకపోవడం దారుణమని వారు అన్నారు.విద్యాలయాలలో ర్యాగింగ్ నిరోధక చట్టం ఉన్న పకడ్బందీగా అమలు చేయడం లేదని, అమలు చేసి కౌన్స్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచాలని,ఆత్మహత్యకి కారణమైన వాటిని కఠినంగా శిక్షించాలని, సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని,ఫ్రీతి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొవాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.ఎవరు ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దని,ఏ సమస్యను అయిన దైర్యంగా ఎదుర్కొవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవిటి. సరళ,జిల్లా అధ్యక్షురాలు బండి.పద్మ,డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల. రమేష్,జిల్లా నాయకులు శీలం.వీరబాబు, కురపాటి.శ్రీను,కొంగర.నవీన్,రావులపాటి.నాగరాజు,గోవర్ధన్,ఐద్వా జిల్లా నాయకులు మెరుగు. రమణ,ఎర్రబోయిన.భారతమ్మ,నైమునిషా.బేగం,నాగసులోచన,అజిత,నాగమణి, అమరావతి,అరుణ, రమాదేవి, బీబీ,పావణి, కుమారి,ఫనింద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు.