
తడిసిన ధాన్యం కొనాల్సిందే….
మండల బిజెపి ప్రధానకార్యదర్శి బిట్టు నాగరాజు
సి కే న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి
చివ్వెంల, ఏప్రిల్ 24
చివ్వెంల: మండలం లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనాల్సిందే. అకాల వర్షాలకు నష్టపోయిన పండ్లతోటలకు రైతులను ఆదుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చివ్వెంల మండల బిజెపి ప్రధానకార్యదర్శి బిట్టు నాగరాజు అధికారులను కోరారు.
మండల కేంద్రాలను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినట్లయితే
పండ్ల తోటలకు ఎకరాకు30 వేలు. వరి ధాన్యానికి 25 వేల రూపాయల బీమా వచ్చేదని భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందనే ఉద్దేశంతో కేసిఆర్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని లేదన్నారు ఇప్పటివరకు అయినా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని ఆదుకోవాలని అన్నారు.