Telangana

తరుగును ప్రశ్నించిన రైతులపై దాడి చేసిన రైస్ మిల్ నిర్వాహకులు

తరుగును ప్రశ్నించిన రైతులపై దాడి

తరుగును ప్రశ్నించిన రైతులపై దాడి

ధాన్యం కొనుగోలులో తరుగును ప్రశ్నించిన ఓ గ్రామ సర్పంచ్‌తో పాటు ఇద్దరు రైతులపై రైస్‌మిల్లు నిర్వాహకులు దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో చేటు చేసుకుంది.
నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావ్‌ పల్లి గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం నుంచి పిట్లం మండలంలోని కుర్తి గ్రామశివారులో ఉన్న వైష్ణవి రైస్‌ మిల్లుకు నాలుగు రోజుల క్రితం లారీని పంపించారు. లారీని డ్రైవర్‌ గేటు బయట పెట్టి వెళ్లాడు. మూడు రోజుల వరకు ఆన్‌లోడ్‌ చేయలేదు.

తర్వాత లారీలో 761 బస్తాలు తరలిస్తే 57 బస్తాలను తరుగు పేరిట మిల్లు యజమానులు కోత విధించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ సాయిలుతో పాటు ముగ్గురు రైతులు రైస్‌ మిల్లుకు వెళ్లారు. 57 బస్తాల కోత విషయమై రైస్‌ మిల్లు నిర్వాహకులను, యజమానులను నిలదీశారు. ఈ విషయమై మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలిసింది.

ఆగ్రహించిన రైస్‌మిల్లు యజ మానిని రాంరెడ్డి అనే రైతు అడ్డుకునేందుకు ప్రయ త్నించాడు. ఈ క్రమంలో రైస్‌ మిల్లు నిర్వాహకులు రైతు రాంరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. రాజిరెడ్డి అనే మరో రైతుపైనా దాడి చేశారు. రైతులపై దాడి చేస్తున్న రైస్‌ మి ల్లు నిర్వాహకులను నిలువరించే ప్రయత్నం చేసిన సర్పంచ్‌ సాయిలను దూషించడంతో పాటు బయటకు గెంటి వేసినట్లు తెలిసింది. తర్వాత సర్పంచ్‌ గాయపడిన రైతు రాంరెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. రైతులపై దాడి సంఘటనను పలువురు నిరసిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected