Telangana

తిన్నరేవు తలవాల్సింది ప్రజలా(ఓటర్లా) లేక ప్రజా ప్రతినిధులా.?

తిన్నరేవు తలవాల్సింది ప్రజలా(ఓటర్లా) లేక ప్రజా ప్రతినిధులా.?

నిన్న,మొన్ననే జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరుపుకున్న సందర్భంగా ఓటరు అభిమతం.

ఎప్పుడూ లేనిది గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా వింటున్న మాట అది రాష్ట్రంలోనే ముఖ్య నేతగా పేరుగాంచిన ప్రజాప్రతినిధి దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మరి తనకు తెలుసో తెలియకో ప్రజలను,ఓటర్లను ఉద్దేశించి వివిధ సందర్భాల్లో వివిధ సభల్లో మాట్లాడుతున్న మాట “తిన్నరేవు తలవాలి,అన్నం పెట్టినోళ్ళకు సున్నం పెట్టద్దు అని వివిధ సందర్భాల్లో వివిధ సభల్లో మాట్లాడుతున్నారు.ఇక నిన్న మొన్న చిన్నాచితక నాయకులు కూడా ఈ పదాలు ఉపయోగిస్తున్న సందర్భాలు లేకపోలేదు.ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికలకు ముందు ఓటర్లే మా దేవుళ్ళు మీరు లేకపోతే మేము లేము ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ గురించే మీ సమస్యల గురించి పోరాడుతాం అని మాట్లాడేవారు తన నియోజకవర్గంలో కూడా ఏమాత్రం గుర్తింపు లేని వారు తన సొంత జిల్లాలో కూడా సరైన గుర్తింపు లేని వారు సైతం ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలు ఆశీర్వదించాలి ఓటర్లు ఆశీర్వదించాలి జీవితాంతం రుణపడి ఉంటాం మాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించండి ఆయా పదవులతో మీ సమస్యలు పరిష్కరిస్తాం అని మాట్లాడే వారు ఎన్నికల తర్వాత పదవులు చేపట్టాక ప్రజలని,ఓటర్లనే మర్చిపోయిన వారు తిన్నరేవు తలవాలా లేక ప్రజలు తిన్నరేవు తలవాలా అని ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది.అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో కావచ్చు తమ విలువైన భూములు కోల్పోయి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూ నామమాత్రపు నష్టపరిహారం తీసుకుంటున్న ప్రజలు తిన్న రేవు తలవాలా లేక స్వరాష్ట్రం వచ్చిన తర్వాత భూముల రేట్లు కోట్లల్లో పలుకుతున్నాయని అటువంటి విలువైన కోట్ల ఖరీదు చేసే భూములను అభివృద్ధి పేరుతో లక్షల్లో నష్టపరిహారం చెల్లిస్తున్న ప్రజాప్రతినిధులు తిన్న రేవు తలవాలా అని ఇక్కడ ఓ సమస్య ఉత్పన్నమవుతుంది.? ఇక
ఏ ప్రభుత్వాలు వచ్చినా మా జీవితాల్లో మార్పు రాలేదని నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ కూడా ఎన్నికల సమయంలో కొందరికి వయసు రిత్యా, ఆరోగ్యరీత్యా తమ శరీరం సహకరించకపోయినా ఎంతో ఓపికగా లైన్ లో నిలబడి ఓటు వేసే ప్రజలు తిన్న రేవు తలవాలా లేక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదో పనిమీద ఆయా ప్రజా ప్రతినిధితో వెళ్లి తమ గోడు వెళ్ళదీసుకుందామని వెళ్తే ఆయా ప్రజా ప్రతినిధులు కావచ్చు వారి పీఏలుగా కావొచ్చు ప్రజలు పలకరిస్తే తిరిగి పలకరించే మర్యాదను కూడా మరిచిన వాళ్ళు తిన్న రేవు తలవాలా లేక ప్రజలు తిన్నరేవు తలవాలా అని ప్రశ్నిస్తున్నారు ఓటర్లైన ప్రజలు. ఇంకా ఎన్నో దశాబ్దాల పాటు రాజకీయ జీవితాన్ని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఎప్పుడూ ఎక్కడ ఎటువంటి ఆస్తుల నష్టం గానీ విలువైన భూములను కోల్పోనటువంటి ప్రజాప్రతినిధులు తిన్నరేవు తలవాలా లేక అడుగడుగునా రోడ్డు వెడల్పు అని ప్రాజెక్టుల నిర్మాణం అని ఇండస్ట్రిల ఏర్పాటు అని ఇలా ఎన్నో రకాలుగా అభివృద్ధి విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో నష్టపోయిన ప్రజలు తిన్నా రేవు తలవాలా ఏ ప్రాజెక్టుల్లో ఏ రైల్వే లైన్ లో తమ భూములు కోల్పోనటువంటి ప్రజాప్రతినిధులు తిన్నరేవు తలవాలా అని నిలదీస్తున్నారు ఓటర్లైన ప్రజలు. ఇక రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితం ద్వారా మేము మా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయామని నిరాశ నిస్పృహలో ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రజాప్రతినిధులకు శాశ్వతంగా వాళ్ల కుటుంబాలకే పరిమితం చేసే విధంగా ప్రజలు ఓటర్లు ఆలోచిస్తున్నారు.
ఎందుకంటే మన ఈ సమాజంలో ఎంతో మంది మహనీయులు తమ విలువైన భూములు పాఠశాలల కోసం కళాశాల కోసం ఆస్పత్రుల కోసం ఇలా పలు రకాలుగా భూములు దానం చేశారు కొందరు జీవితాలు త్యాగం చేశారు అటువంటివారుగాని వారి వారసులు గాని ఎప్పుడూ కూడా తిన్న రేవు తలవాలి,అన్నం పెట్టినోడికి సున్నం పెట్టొద్దు అనే మాట మాట్లాడిన సందర్భాలు లేవు. పైగా ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ప్రజల కోసం విలువైన భూములు దానం చేసిన వారి ఆశయాలు నెరవేర్చాల్సింది పోయి వారు దానం చేసిన విలువైన భూములను అన్యాక్రాంతం అయ్యే విధంగా వ్యవహరిస్తున్న ప్రజా ప్రతినిధులు అంటూ ప్రముఖ దినపత్రికల్లోను టీవీ ఛానల్లోనూ వార్తలు వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అటువంటిది ప్రజలు కట్టిన పన్నులతో లక్షల్లో జీతాలు పొందుతూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓటర్లైన ప్రజలను చిన్నచూపు చూసే ప్రజాప్రతినిధులు సమాజానికి అవసరం లేదని ఓటర్లు భావిస్తున్నారు.

వ్యాసకర్త.
ఓ సాధారణ ఓటరు & సీనియర్ జర్నలిస్ట్.
సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు.సిద్దిపేట.9985021041.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected