Telangana

తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుపై నిరసనగా రాస్తారోకో……

తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుపై నిరసనగా రాస్తారోకో……

తీన్మార్ మల్లన్నకు మద్దతుగా అన్నీ రాజకీయ పార్టీలు, కుల సంఘలు, విద్యార్థి సంఘల నాయకులు….

క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకులు….

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి అడ్డుపడ్డ పోలీసులు…

ప్రశ్నించే గొంతులను చంపేయాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ

తక్షణమే బేషరత్ గా తీన్మార్ మల్లన్న విడుదల చేయాలని డిమాండ్….

బయ్యారం మండల కేంద్రంలో అన్నీ రాజకీయ పార్టీ నాయకులు, కుల సంఘల నాయకులు, విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టుపై మరియు Q న్యూస్ కార్యాలయాన్ని ద్వంసం చేసిన దానిపై నిరసనగా ఈ రోజు మహబూబాబాద్ టూ భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ క్యూ న్యూస్ వ్యవస్థాపకులు, ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న కొన్ని నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలనను ప్రశ్నిస్తూ, భూ కబ్జాలను వెలికితీస్తూ రోజురోజుకు తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తున్నాడని అంతేకాదు కవిత లిక్కర్ స్కాంపై, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ పై వరస కథనాలు రాస్తూ అటు తెలంగాణ సమాజాన్ని ఇటు విద్యార్థి నిరుద్యోగులను చైతన్యం చేయడాన్ని చూసి ఓర్వలేక సోమవారం రోజున హైదరాబాద్ క్యూ న్యూస్ కేటీఆర్ అనుచరులు, బి.ఆర్.ఎస్ రౌడీ షీటర్లు, గుండాలు,పోలీస్ లు చొరబడి క్యూ న్యూస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి సిబ్బందిని, మల్లన్నని అరెస్ట్ చేయడం హేయమైన చర్యని అన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పత్రిక కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా చర్చకు రావాలని ఇలా ముసుగులు తోడుక్కొని కిరాయి గుండాలతో దాడులు చేయించడం పిరికిపంద చర్య అని తెలంగాణ రాష్టంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై క్యూ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని క్యూ న్యూస్ తిన్మార్ మల్లన్న టీమ్ ఎవ్వరికి బయపడదని హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయని వీరి అన్యాలను అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తున్న తీన్మార్ మల్లన్నకు ఎప్పుడు ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో VHP జిల్లా అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వర్ రావు, బీజేపీ పార్టీ అధ్యక్షులు వీసం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాయిని శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి సీతారామరెడ్డి, బానోత్ సుధాకర్ నాయక్, మందనపు వెంకన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు తుడుం వీరభద్రం,PDSU రాష్ట్ర నాయకుడు నేతకాని రాకేష్, ప్రజాపంధ సంయుక్త కార్యదర్శి బిల్లకంటి సూర్యం, CITU మండల కార్యదర్శి వల్లాల వెంకన్న, AISFI జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు తోకలు ఎంకన్న, రామచంద్రుల మురుళి,డబ్బా వెంకటనర్సు, కొత్త రాందాస్, పొంగిలేటి కోరం వర్గీయులు సంకు సత్తిరెడ్డి, రాసమల్ల నాగేశ్వరరావు, నందగిరి భద్రయ్య, MRPS జిల్లా నాయకుడు గంట శ్రీనివాస్ మాదిగ, సేవాలాల్ సేన జిల్లా కార్యదర్శి రవీందర్ నాయక్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వీనయ్ బాబు, బిసి జనసభ జిల్లా అధ్యక్షులు చల్లా గోవర్ధన్, T-MRPS మండల అధ్యక్షులు పోతురాజు రాజశేఖర్ మాదిగ, కేవీపీస్ మండల అధ్యక్షులు చంటి, LHPS మండల అధ్యక్షులు నరేష్, ఆదివాసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ప్రకాష్, లైవ్ ఐక్య వేదిక మండల కార్యదర్శి బోడ బావుసింగ్,బిసి సంక్షేమసంఘ యూత్ అధ్యక్షులు కాకి విజయ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుల్లూరి ఉపేందర్, జర్నలిస్ట్ లు, ఇంద్రారెడ్డి, తుడుం రాజేష్, కొమిరె జనార్ధన్, నాయకులు జినక లక్ష్మణ్, మరికంటి నరేష్, నందిపాటి సురేష్, గుర్రం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected