తీరు మార్చుకోకుంటే సెంటర్ క్యాన్సల్ చేస్తా..
తీరు మార్చుకోకుంటే సెంటర్ క్యాన్సల్ చేస్తా..

తీరు మార్చుకోకుంటే సెంటర్ క్యాన్సల్ చేస్తా..
నెల్లికుదురు పిఎసిఎస్ కు కలెక్టర్ హెచ్చరిక.
గత ధాన్యం కొనుగోళ్లపై ఎంత కమిషన్ వచ్చింది?
ఆ 15 లక్షల్లో ఎంత ఖర్చు చేశారు?
లారీలు ఎందుకు సమకూర్చడం లేదు
నెల్లికుదురు.. నిర్వహణ తీరులో మార్పు తీసుకురాకపోతే కొనుగోలు కేంద్రాన్ని క్యాన్సిల్ చేసి ఐకెపి సెంటర్కు అప్పగిస్తామని కలెక్టర్ శశాంక నెల్లికుదురు పిఎసిఎస్ ను హెచ్చరించారు.మండల కేంద్రం నెల్లికుదురు పి ఎస్ ఎస్ నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి శశాంక గురువారం సందర్శించి తనిఖీ చేశారు ధాన్యం, మక్కల నిల్వలను చూసి ఎప్పటికప్పుడు ఎందుకు తరలిస్తలేరని పిఎసిఎస్ సీఈవో ను అడిగారు
.దీంతో సీఈఓ బందారపు యాదగిరి తడబడుతూ సమాధానం చెప్తుంటే కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ గతేడాది ధాన్యం కొనుగోలు పై ఎంత కమిషన్ వచ్చిందని అడగడంతో 15 లక్షల లాభం వచ్చిందని సీఈవో తెలిపారు ఆ లాభంలో కొనుగోలు కేంద్రం సౌకర్యం కోసం ఎంత ఖర్చు చేశారన్నారు తార్ఫాలిన్ ఎన్ని ఉన్నాయని రైతులకు ఇస్తున్నారా లేదా అని కలెక్టర్ అడగడంతో 200 తార్పాలిన్లు ఉన్నాయని సీఈఓ తెలిపారు
దీంతో అక్కడున్న రైతులు మాకు ఎవరికీ ఇవ్వడం లేదని కలెక్టర్కు తెలిపారు ధాన్యం, మక్కలు తరలింపు కోసం సంబంధిత పిఎసిఎస్ లారీలు సమకూర్చాలని లేని పక్షంలో మీ సెంటర్ ను క్యాన్సిల్ చేసి ఐకెపికి కేటాయిస్తామన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, ఆర్డీవో రమేష్, జిల్లా సహకార అధికారి కుర్షిద్, డి ఎం సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, తాసిల్దార్ యోగేశ్వరరావు, సర్పంచ్ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.