AdilabadTelangana

తూరుబాక గిరిజన సొసైటీలో ఎంఎల్ఏ అనుచరుడు హవా…

తూరుబాక గిరిజన సొసైటీలో ఎంఎల్ఏ అనుచరుడు హవా

తూరుబాక గిరిజన సొసైటీలో ఎంఎల్ఏ అనుచరుడు హవా…

తూరుబాక ఇసుక గిరిజన సొసైటీ నుండి ఎంఎల్ఏ స్వరవతో సభ్యులను తొలగింపు..

తూరుబాక ఇసుక గిరిజన సొసైటీ నుండి తొలగించిన గిరిజన సభ్యులను సొసైటీలో చేర్చుకోవాలని ఆందోళన చేపట్టిన సర్పంచ్..

గిరిజన పిసా కమిటీ సభ్యుల ఆమోదం లేకుండానే ఏకపక్షముగా ఇసుక రీచ్ కమిటీని నియమించుటకు డిసిఒ ప్రయత్నించారు.

ఇసుక ర్యాంపు వర్క్ ఇన్స్పెక్టర్ ను
సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగిన సర్పంచ్..

డిసిఒ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చెసిన గిరిజనులు..

తూరుబాక గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్య చందు నాయక్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఏప్రిల్ 20,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామపంచాయతీలో గతం ఐదు సంవత్సరాల క్రితం గిరిజన పిసా కమిటీ గ్రామ సభ ఆమోదంతో ఇసుక సొసైటీని ఏర్పాటు చేశారు.అట్టి గిరిజన ఇసుక సొసైటీలో ఉన్న అర్హులైన ఎనిమిది మంది గిరిజన సభ్యులకు తెలియకుండానే సొసైటీ నుండి తొలగించారని తూరుబాక గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్య చందు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తూరుబాక గ్రామపంచాయతీ కార్యాలయంలో ‌
గిరిజన పిసా గ్రామ కమిటీ ఆమోదం లేకుండా గ్రామ పంచాయితీ సర్పంచ్ అనుమతు లేకుండా ఏకపక్షంగా డి సి ఓ
టిఎస్ఎండిసి అధికారులు భద్రాచలం నియోజకవర్గం ఎంఎల్ఏ అండదండలతో అధికారాన్ని ఉపయోగించి పోలీసుల ప్రొడక్షన్ తో ఇసుక సొసైటీని నియమించుటకు ఏర్పాటు చేశారు. సర్పంచి ప్రమేయంలేకుండా పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించడానికి ప్రయత్నించగా గ్రామపంచాయతీ సర్పంచ్ గిరిజనులుతో కలిసి ఇదేమి పద్ధతిని ప్రశ్నించగా సర్పంచిని గిరిజనులను పంచాయతి కార్యాలయం లోపలికి రానివ్వకుండా అధికారాన్ని ఉపయోగించి పంచాయితీ గేట్లు మూసివేసి పోలీసులతో అడ్డుకున్నారు. దీంతో సర్పంచి గిరిజనులు కలిసి ఆందోళన చేపట్టారు

గత ఐదు సంవత్సరాల క్రితం గిరిజన ఇసుక సొసైటీ నుండి అర్హులైన ఎనిమిది మంది గిరిజన సభ్యులను గిరిజన సొసైటీ సభ్యులకు తెలియకుండానే భద్రాచలం ఎంఎల్ఏ చొరవతో డిసీఓ అధికారులు గిరిజన సొసైటీలో ఉన్న సభ్యులను తొలగించారని ఆవేదన వ్యక్తపరిచారు. గిరిజన ఇసుక సొసైటీ నుండి సభ్యులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కారణం లేకుండా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు.

ఈ విషయం తెలుసు కున్న గ్రామపంచాయతీ సర్పంచి గిరిజన ఇసుక సొసైటీ నుండి తొలగించిన ఎనిమిది మంది అర్హులైన సభ్యులతో పాటు మరో ఐదుగురిని కలుపుకొని 13 మంది సభ్యు లను కమిటీలో చేర్చాలని పలుమార్లు డిసిఒ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. సర్పంచ్ ఇచ్చిన వినతి పత్రాలను బేకార్తాలు చేస్తూ అధికారులు ఉన్న ఎంఎల్ఏకు కొమ్ముకాస్తూ గిరిజన ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రజల పక్షాన ఉండి అందరినీ సమానంగా కలుపుకుని పోవాల్సిన ఎంఎల్ఏ ఏక పక్షముగా స్థానిక గిరిజనులు అవమాన పరుస్తూ పార్టీకి కొమ్ముకాస్తూ పార్టీకి వత్తాసు పలుకుతూ మరికొంత మంది నూతన సభ్యులతో నూతన ఇసుక సొసైటీ కమిటీని ఏర్పాటు చేయుటకు డిసిఓ, టిఎస్ఎండిసి అధికారులతో ఏక పక్షముగా కమిటీని నియమించే ప్రయత్నం చేశారు. ప్రయత్నాన్ని స్థానిక పంచాయతీ సర్పంచ్ గ్రామస్తులతో అడ్డుకోవడంతో తిరిగి వెళ్ళిపోయారు.

స్థానిక సర్పంచి ప్రమేయం లేకుండా పంచాయతీ కార్యాలయంలో దౌర్జన్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయంలో దౌర్జన్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంఎల్ఏ అనుచరుడు బొలుసు. సతీష్ ,కొనేరు నాగేష్ పై చర్యలు తీసుకోవాలి సర్పంచ్ డిమాండ్..

గిరిజనేతరుడైన బోలుసు సతీష్ కొంతమంది గిరిజనులకు డబ్బు ఆశ చూపించి లోబర్చుకొని గిరిజనుల మధ్యలో చిచ్చుపెట్టి మాలో మాకే గొడవలు పెడుతూ కొట్టుకునేలా చేస్తున్నందుకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.

తూరుపాక గ్రామపంచాయతీ లో పంచాయతీ సర్పంచ్ ప్రమేయం లేకుండా దౌర్జన్యంగా నూతనముగా గిరిజన ఇసుక సొసైటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరుడు బలుసుసతీష్ కోనేరు నాగేష్ లపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజలు పంచాయతీ సర్పంచ్ డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected