
తెలంగాణలో IAS అధికారుల బదిలీ..ఉత్తర్వులు జారీ!
తెలంగాణలో ముగ్గురు IAS అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. CCLA సెక్రెటరీగా బి.గోపికి పోస్టింగ్ ఇవ్వగా..CCLA స్పెషల్ ఆఫీసర్ గా ఆశీష్ సాంగ్వాన్ ను ప్రభుత్వం నియమించింది.
అలాగే సమాచార శాఖ డైరెక్టర్ గా కోరం అశోక్ రెడ్డిని నియమించారు. అదే సమయంలో CCLA డైరెక్టర్ గా ఉన్న హైమావతి, CCLA స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న సత్య దేవీలను జేడీఏలో రిపోర్ట్ చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ బదిలీలు ఆసక్తికరంగా మారాయి
కాగా కొన్నిరోజుల క్రితం ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను దాదాపు 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఆ తర్వాత రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ DGP అంజనీ కుమార్ పోస్టింగ్ లు ఇచ్చారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ బదిలీలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి రాబోయే రోజుల్లో కూడా భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం