
ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఅర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల
తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ..
-. దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడు.
-. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతడట.
రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతాడట.
-. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటాడట.
-. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర?
ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా?
-. గెలిస్తే 100రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మోసం చేశావ్.
అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేశావ్.
-. ఎన్నడో మూతపడిన IDPL,HMT,HCL,ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదు.
-. ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించు.
-. రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకో.
దమ్ముంటే కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించు.
కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తదన్న మీ హామీని నిలబెట్టుకో.
“కేసీఆర్ @చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి “