తెలంగాణ చెస్ అధికార ప్రతినిధిగా ‘అనంచిన్ని’

తెలంగాణ చెస్ అధికార ప్రతినిధిగా ‘అనంచిన్ని’
★ తొలిగిన 4 ఏళ్ళ స్తబ్దత
★ నూతన కార్యవర్గం ఏర్పాటు.
తెలంగాణ చెస్ అసోసియేషన్ లో గత నాలుగేళ్ళుగా నెలకొన్న స్తబ్దత తొలిగింది. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా, కోయచలక గ్రామానికి చెందిన చదరంగ ప్రముఖులు అనంచిన్ని వెంకటేశ్వరరావుకు తెలంగాణ చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవితో పాటు అధికార ప్రతినిధి హోదా దక్కింది.
తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. అధ్యక్షుడిగా మేజర్ కె.ఎ.శివ ప్రసాద్ (రంగారెడ్డి), ఉపాధ్యక్షులుగా ఎం అంజయ్య(కరీంనగర్), అనంచిన్ని వెంకటేశ్వరరావు(ఖమ్మం), కె కరుణాకర్ రెడ్డి(నల్గొండ), ప్రధాన కార్యదర్శిగా బి.వి.రాజ గోపాల్(వరంగల్), సంయుక్త కార్యదర్శులుగా జి శ్రీనివాస్(కరీంనగర్), టిడి టామీ(వరంగల్), ఎ.రమేష్, కోశాధికారిగా ధన ఆర్ సిహెచ్ (రంగారెడ్డి)ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా తెలంగాణ జిల్లాలకు చెందిన ఇ.దామోదర్, జి.దిలీప్ కుమార్, సత్యనారాయణ, కొమ్ము వెంకట్, వై.రవి కుమార్, పి.ఆదిత్య ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2027 వరకు కొనసాగనున్నట్లు ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, కె.సతీష్, బి.గోవిందులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.