Telangana

తెలంగాణ సిరుల గని సింగరేణిని వేలం వేస్తే మహోద్యమం తప్పదు..మంత్రి పువ్వాడ.

తెలంగాణ సిరుల గని సింగరేణిని వేలం వేస్తే మహోద్యమం తప్పదు..మంత్రి పువ్వాడ.

సికే న్యూస్ ప్రతినిధి కొత్తగూడెం

తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదని, కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటీకరణ కుట్రలకు తెర లేపిందని, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణ్‌పల్లి, పెనగడప గనులకు మరోసారి వేలంకు నోటిఫికేషన్ వేసిందని అయా ప్రక్రియలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మహోద్యమం చేపడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు.

BRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గారి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో BRS పార్టీ మరియు TBGKS అధ్వర్యంలో చేపట్టిన నిరసన, మహాధర్నాలో ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరై మాట్లాడారు.

తెలంగాణకు సిరుల గని అయిన మన బొగ్గు గనులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా బొగ్గు గనుల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుని, ప్రజల ప్రయోజనాలు, వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పించిందని, రోడ్లు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి మనకు అశ్రమాన్ని కల్పించిందన్నారు. నేడు కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్ల సింగరేణిని మనకు దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం పై మంత్రి ధ్వజమెత్తారు.

సింగరేణిని ప్రైవేటీకరిస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని, బొగ్గు గనుల్లో వచ్చే లాభాలను పంచే సంస్థ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, బోనస్‌లు, అలవెన్సులు ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతయన్నారు..

సింగరేణి ఉద్యోగులకు అత్యధిక బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయాడని, ఇది సహించలేని కేంద్రం దాని అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ గారు శ్రీ రామ రక్షగా ఉన్నాడు కాబట్టే ఇప్పటిదాకా సింగరేణి ఇంకా మిగిలి ఉందని లేకపోతే దాన్ని ఇప్పటికే కార్పొరేట్ లకు దరాదత్తం చేసి ఉండేవారని పేర్కొన్నారు.

సింగరేణి నీ ప్రైవేటీరణ చేయమని చెప్పి మళ్ళీ గనులకు వేలంకు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. సింగరేణి ఏ విధంగా ప్రైవేటు పరం చేస్తారో మేము కూడా చూస్తామన్నారు.

ప్రతి ఏడాది లాభాలలో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టకుండా కుట్రలతోనే సమర్థవంతమైన అధికారులను తప్పిస్తారాని తప్పించేందుకు కేంద్రం కుట్రలు చేస్తారని అన్నారు.

విదేశాలకు ముందు మోడీ వెళతారు ఆ తరువాత అదాని వారి వెనకాల పోతారని, నీ స్నేహితులైన ఆదానికి ప్రభుత్వ సంస్థలను బంగారు పళ్లెంలో పలహరంలా పెడతావని, కేవలం వాళ్లకు మేలు చేసేందుకే ప్రభుత్వ అసుతులను, ప్రభుత్వ సంస్థలను అమ్మి వారికి లాభం చేకూర్చడం సిగ్గుచేటన్నారు.

సింగరేణి సంస్థను నష్టాల్లోకి పంపాలని కేంద్ర ప్రభుత్వం ముఖ్యఉద్దేశం అని అన్నారు.. సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు.. ఇది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. దీన్నీ అమ్మాలని చూస్తే తెలంగాణ సమాజం గుండెల్లో రగులుతున్న అగ్నిని మీరు చూడల్సి వస్తుందని హెచ్చరించారు.

వందే భారత్ రైళ్ళను ఇప్పటికే 10సార్లకు పైగా ప్రధాని మోడీ ప్రారంభించారని, ఒకే రైలును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.

సింగరేణి వేలం విషయంపై కేంద్రం వెనకి తగ్గకుంటే జంగ్‌ సైరన్‌ మోగిస్తామని, BRS జాతీయ అధ్యక్షుడు కేసీఅర్ , రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ నేతృత్వంలో మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected