Telangana

తెలంగాణ హార్ట్ కు ఎటాక్

తెలంగాణ హార్ట్ కు ఎటాక్…

హెచ్ యం డి ఏ పరిధిలో భూములు కొన్నోళ్లు ఇక మీ భూమి స్మశానమే…

హెచ్ యం డి ఏ పేరిట జి. ఓ నెంబర్ 33 తెచ్చినం…!?

తెలంగాణ హార్ట్ కు ఎట్టాక్ తెప్పించినం..!?

నాలుగు కోట్ల ప్రాణమా నా నవ్వుల పాలైన తెలంగాణమా..!?

తెలంగాణ సాధించినం..!?
తెలంగాణను అభివృద్ధి చేసినం..!?
తెలంగాణ ప్రజలను కన్నీరు పెట్టించినం..!?
జిల్లాలను చించిన విస్తరి చేసినం…!?
ప్రజల జీవితాలతో ఆడుకునే ధరణి తెచ్చినం..!?
ఊర్లభూముల్ల చిచ్చులు పెట్టినం..!?
హెచ్ యం డి ఏ పరిధిలో మీ భూమి ఏ జోన్ లో ఉందో వెదుక్కో…??

కై రాజా కై.. ఇక మీ స్థలంలో టాయ్ లెట్ మాత్రమే.. లేదు లేదు.. మాన్ఫాక్చర్ మాత్రమే.. లేదు లేదు అగ్రికల్చర్ మాత్రమే.. తూచ్ రెసిడెన్సియల్ జోన్.. కాదు కాదు కమర్శియల్ యూస్ జోన్… చివరికి మల్టిపుల్ యూస్ జోన్.. లేదా ఓపెన్ ప్లేస్ జోన్…. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది అనిపిస్తే అది ఏది నచ్చితే అది అన్నచందంగా తెలంగాణ రాష్ట్రాన్ని చీల్చి ఛండాడిన వస్తువుగా మనకు తెలియ కుండానే మనం కొన్న భూమి ఏ జోన్లో ఉందో అర్ధం కాకుండా సామాన్య మానవుడు తెలంగాణ రాష్ట్రము విడిచి పారిపోయేలా తాతలు, ముత్తతలు దున్నుకున్న భూమి అయినా కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న భూమి అయినా తెలంగాణ రాష్ట్రములో ఏక్ తప్పడ్ మార్న.. పూరా జమీన్ లేనా అనే నూతన ఒరవడిని తీసుకువస్తూ ప్రజలను ఇబ్బందులకు నెట్టటమే ద్యేయంగా, మనిషి రక్తాన్ని పీల్చే జలగల్లా ప్రజా ధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా కొత్తపంతాలతో అర్ధం కాని జీవో లను అనేకం తెస్తూ ప్రజల జీవితంతో ఫుట్ బాల్ ఆడుతున్న పరిస్థితి నెలకొంది అనవచ్చు..

ఈ జీవో 33ను చూస్తే…


ఆనాటి మూర్ఖుల అత్యుత్సాహమో లేదా ప్రజల జీవితాలను వారి ఆస్తులను లాక్కునే కుట్రనో తెలియదు గాని.. ఈ 33జీవో ఉమ్మడి రాష్ట్రములో పురుడు పోసుకొని మూలన పడ్డది. అవకాశమే తడువుగా మనం సాధించుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి దొరికిన కోహినూర్ వజ్రంగా మారిపోయింది. ప్రజల జీవితంతో ఆడుకునే పదునైన పైసలు ఇచ్చే ఆయుధం అయ్యింది అనవచ్చు.. హెచ్ ఎమ్ డి ఏ ఇప్పుడు ప్రజలకు ఇస్తున్న నోటీసులు చూస్తే…!?


ఒక వ్యక్తి తన కష్టారుజీతంతో నాలుగు ఎకరాల భూమిని 2018లో కొన్నాడు. అది అప్పటికే పబ్లిక్ యూటీలిటీ జోన్లో ఉంది. అయినా ప్రజల రక్తంపీల్చుకు తాగేందుకు అలవాటుపడిన ఆ ప్రభుత్వ విభాగం అది ఏది క్రాస్ వెరిఫికేషన్ చేయకుండానే ఆనాడు లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టించుకొని దర్జాగా రిజిస్ట్రేషన్ చేశారు.

ఆ భూమి లో అతను ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని ప్రశాంతంగా తన జీవితం తాను గడుపుకుంటుంటే అప్పుడు లేని అడ్డంకి ఇప్పుడు ఒక్కసారిగా హెచ్ ఎమ్ డి ఏ అధికారులకు విధి నిబద్దత గుర్తుకు వచ్చి ఈ బాధితునికి నోటీసు అందజేస్తూ.. నీ ఇంటిని ఫామ్ కూల్చి వేస్తాం.. గతంలో గ్రామ పంచాయతీ ఇచ్చిన ఏ పర్మిషన్ లు చెల్లవు అంటూ చావు కబురు చల్లగా చెప్పటంతో అవక్కు అయిన ఆ బాధితులు అయోమయం అగమ్యగోచరంగా హై కోర్టు తలుపు తట్టటం విశేషం.
ఇలా చాలా మందికి హెచ్ ఎమ్ డి ఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారని అవి తీసుకున్నబాధితులు వాపోతున్నారు.

కావున నాటి తప్పిదం అప్పటి ప్రభుత్వం చేసి ఆ 33జీవో ను మరుగున పడేస్తే అభివృద్ధి ద్యేయంగా నియామకాలు లక్ష్యంగా ఉద్యమించిన తెలంగాణ ఉదయించే సూర్యులవలే ఇప్పుడిప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకుని నాలుగు ఎకరాల భూములు కొనుక్కున్న సామాన్యుల నడ్డివిరిచే ప్రయత్నం జరగటంతో నాలుగు కోట్ల ప్రజల ఆశయం, ఆకాంక్ష అడియశఅయిపోయి నవ్వుల తెలంగాణ గా మిగిలిపోతుంది అనేది ప్రజల బాధ.. కావున ప్రజల బాధలు తీర్చే ప్రభుత్వం కావాలి కానీ ప్రజల్ని పీడించే ప్రభుత్వం వద్దు అనేపరిస్థితి రాకూడదని ఆశిస్తూ…మీ డాక్టర్ మురహరి బుద్దారం నాజా జాతీయ అధ్యక్షులు అందిస్తున్న నేటి ఈ ప్రత్యేక కదనం..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected