దళిత బంధు లో ఎవరు కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యే లదే బాధ్యత

ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. “దళితబంధులో కొంత మంది ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు కమిషన్ తీసుకున్నారు. ఆ చిట్టా నా వద్ద ఉంది. ఆ ఎమ్మెల్యేల సంగతి త్వరలో తేలుస్తా. అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యత. ఇంకోసారి ఈ తప్పు చేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను. వారు పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిందే. ఇదే చివరి వార్నింగ్. లేకుంటే కొత్త వారికి అవకాశమిస్తాను.” అని ఆయన హెచ్చరించారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించారు.
CM KCR | అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, తర్వాత గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రతినిధుల సభ సమావేశమైంది. ఎంపీ కే కేశవరావు ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.
రైతులను చైతన్యం చేయాలి..
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. ‘రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేశాం. అదే పంథాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్‌ఫెడ్‌కు ఈ మేరకు ఆదేశాలిస్తం. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. దేశ జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా 23 శాతం.
‘కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్లేసి నా ఆఫీసులో ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా ఉంటే వాటిని తక్షణం పంచేద్దాం. మన శాసనసభ్యులు నియోజకవర్గాల్లో చోట జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇన్‌చార్జిలను ఉపయోగించుకోవాలి. ఈ 3, 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండడంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఏపీ తలసరి ఆదాయం రూ.2,19,518. ఇది మనకన్నా రూ.లక్ష తక్కువ. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 ఉన్నాయి. తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు’ అన్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు 12.45 గంటల వరకు అక్కడికి చేరుకోవాలి. 30న మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల వరకు మంత్రులు వారి వారి చాంబర్స్‌కు వెళ్లాలి. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్రీఫ్ మీటింగ్, లంచ్ ఉంటుందన్నారు. మెయిన్ గేట్ గుండా సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉద్దేశించింది. నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు, సౌత ఈస్ట్ జనరల్ విసిటర్స్ కోసం ఉద్దేశించింది.
మహారాష్ట్ర సర్కార్‌కు విజన్ లేదు
‘మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి. మనం ఎలా ముందుకుపోవాలని మేధోమదనం చేశాను. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు. మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ, తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు? 2021-2022కి ముందు జీఎస్టీ ఆదాయం రూ.34వేల కోట్లు ఉంటే.. అంచనా రూ.44వేల కోట్లు పెట్టుకున్నం’ అని వివరించారు.