
గాంధీ భవన్
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
దశాబ్ది ఉత్సవాలని బహిష్కరించాలి
దశాబ్ది ఉత్సవాల పేరుతో కెసిఆర్ మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరుతున్నాడు.
ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి.
తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారు.
కేసీఆర్ ఎం తీసుకొచ్చారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చావా? దళిత ముఖ్యమంత్రి ఇచ్చావా? నిరుద్యోగ భృతి,రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చావా?
కేసీఆర్ వచ్చాక అన్నింటిలో అవినీతే.
కర్ణాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు.
తెలంగాణలో 500 శాతం ఆవినీతే. ఇక్కడి ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెపుతారు.
కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ తీసుకురాలేకపోయాడు.
పోడు భూములకు పట్టాలివ్వలేదు.
ప్రజల్ని డైవర్ట్ చేయడానికే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు.
గిరిజనులకి, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచినందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారా?
కర్ణాటకలో మంత్రులు ఏవిధంగా ఓడిపోయారో… ఇక్కడ కూడ అదేవిధంగా ఓడిపోతారు.