
అక్రమాలకు పాల్పడ్డ దుమ్ముగూడెం తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ అనుదీప్..
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 04,
భూమి బదలాయింపు లో అక్రమాలకు పాల్పడి చట్టం ఉల్లంఘిస్తూ గిరిజనే తరులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన అంశంపై దుమ్ముగూడెం తహశీల్దార్ కె. చంద్ర శేఖర్ రావును విధుల నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్ర శేఖర్ రావును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దుమ్ముగూడెం మండలంలో 18 మంది గిరిజనేతరులకు పట్టాలు జారీ చేయడంతో గతంలో తహసీల్దార్ పై ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఫిర్యాదులు చేయడం జరిగిందని చెప్పారు.
ఏజన్సీ లో అమలులో ఉన్న చట్టాలను కాలరాసి తన ఇష్టానుసారంగా గిరిజనేతరులకు పట్టాలు జారీ చేసినందున ఈ చర్యలు చేపట్టారు.
ఎజన్సీ చట్టాలను ఉల్లంఘించి గిరిజనేతరులకు పట్టాలు జారీ చేసి, తిరిగి ధరణిలో అర్హులైన వారికి పట్టాలు జారీ చేయుటకు పునరుద్ధరణ చేయాలని సిఫారసు చేయడం జరిగిందని చెప్పారు.
పట్టాదారు పాసు పుస్తకాలు జారీ లో జరిగిన అవకతవకలపై తహశీల్దార్ కె చంద్ర శేఖర్ రావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చునని ప్రాధమికంగా నిర్దారణ చేశారు.
సర్వీస్ రూల్స్ 8 లోని ఉప నిబంధన (1)(ఏ) ద్వారా అధికారాలను అమలు చేయడంలో టి.ఎస్.సి.ఎస్ ( సి సి&ఏ) రూల్స్ 1991 ఉత్తర్వులు ప్రకారం అతనిని సస్పెండ్ చేశారు.
సస్పెండ్ చేసిన చంద్ర శేఖర్ రావు ను భద్రాచలంను భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, సస్పెన్ అమలులో ఉన్న కాలంలో అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లుటకు అనుమతి లేదని కలెక్టర్ ఆదేశించారు.