
సీకే న్యూస్…. సూర్యాపేట జిల్లా చివేంల
దేశవ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టలేని ప్రధాని మోడీకి దేశాన్ని పాలించే అర్హత లేదు…
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…
దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టలేని ప్రధాని మోడీకి దేశాన్ని పరిపాలించే అర్హత లేదని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి విమర్శించారు.
కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ రక్షణ యాత్రలో భాగంగా రెండో రోజు చివ్వెంల మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు 300 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు
ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాల్లో దళితులకు దళిత మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మోడీ రాజ్యాంగంలో దళితులకు పొందుపరిచిన హక్కులు చట్టాలు అమలు చేయకపోవడం దుర్మార్గం అన్నారు.
రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం రక్షించుకునేందుకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట బాట పట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షు లు, రాంబాబు నాయకులు గోపి,వీరబాబు, ఉప్పల గోపి తదితరులు పాల్గొన్నారు.