
వైఎస్ షర్మిల ను బేగంపేట వైపు తీసుకు వెళ్తున్న పోలీసులు
గాంధీ ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ లు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించే అవకాశం
గాంధీ ఆసుపత్రిలో వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు
మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలింపు
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైయస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ని చూడటానికి స్టేషన్ కు వెళ్తుండగా పోలీసులు విజయమ్మ ని అనుమతించలేదు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఎందుకు షర్మిలను అడ్డుకుంటుంది?
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి వైయస్ షర్మిల కాబట్టి ప్రభుత్వం ఇంత కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది
ప్రతి సారి హౌజ్ అరెస్టులతో అణచివేస్తున్నారు
ఒంటరిగా సిట్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే అరెస్టులు ఎందుకు
గ్రూప్స్ పరీక్ష పేపర్లు, పదో తరగతి పేపర్లు లీక్ అయ్యాయి – దీనిపై ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తేనే తప్పా?
ఇంటి చుట్టూ టెర్రరిస్టు లకు ఉంచినట్టు పోలీసులను ఎందుకు పెడుతున్నారు?
పోలీసులతో స్టేషన్ లో నా కూతుర్ని చూసి పోతానంటున్నా అనుమతించట్లేదు
షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను అడిగితే సమాధానం లేదు
వైయస్ షర్మిల మాత్రమే మొట్టమొదటగా నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసింది
ప్రజల తరఫున ఏ పోరాటం చేసినా అడ్డుకుంటున్నారు
పోలీసులు ఎందుకు షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా?
ఒక మహిళపై కనీస గౌరవం లేకుండా అంతమంది పోలీసులు పైన పడుతుంటే ఆవేశం రాదా?
పది మంది మహిళా పోలీసులు నాపై పడుతూ, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నన్ను కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది.
పోలీసులు షర్మిల డ్రైవర్ ను కొట్టారు, గన్ మెన్లను కొట్టారు, మీడియా వాళ్లను కొట్టారు.. ఎందుకిలా వ్యవహరిస్తున్నారు.
మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా ప్రజల తరఫున నిలబడండి. మీడియా నిజాలు చూపించాలి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు. మీడియా ప్రజల కోసం పని చేయాలి.
వైయస్ షర్మిల ప్రజల కోసం పోరాడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సాకారం చేయడానికి కష్టపడుతోంది.
ఒక మహిళ 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిందంటే ప్రజలు ఆలోచించాలి
న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అణచివేస్తారు.
ప్రతిపక్షాలు ప్రశ్నించిన వాటికి పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటి?
ఇలా ఎన్ని సార్లు పోలీసులు అరెస్టులు చేస్తారు
అసమర్థతను పక్కనపెట్టి.. నియంత పాలన వదిలి ప్రజల కోసం పని చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం
ఈ విషయంపై కోర్డుకు వెళ్తాం అన్నారు