నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించలేని బిఆర్ఎస్ ప్రభుత్వం దేనికి?

నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించలేని బిఆర్ఎస్ ప్రభుత్వం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 07,
బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం సుధాకర్ రావు మార్కాపురం సీతారాములు ప్రచారంలో భాగంగా భద్రాచలం పట్టణంలో ఉన్న నాయి బ్రాహ్మణ సెలూన్స్ షాపులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ టైం లో నాయి బ్రాహ్మణులకు 30 వేల కటింగ్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తామని వాగ్దానం చేశారు కానీ ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి వాగ్దానం నెరవేర్చలేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు కరోనా టైం లో ఎన్నో ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో అవస్థ పడ్డారు అయినా కూడా నాయి బ్రాహ్మణుల మీద కేసీఆర్ కి సిన్న సూపే అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఏ నాయి బ్రాహ్మణుడికి ఇవ్వలేదు నాయి బ్రాహ్మణుల ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ఈరోజు ఎన్నో ఏళ్ల తరబడి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నాయి బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు 50 సంవత్సరాలు నిండిన నాయి బ్రాహ్మణులకు పింఛను ప్రకటించాలని ఎందుకంటే చిన్నతనం నుండి కౌరవుత్తి చేయటం వల్ల 50 సంవత్సరాల వయసు రాగానే ఎంతోమందికి కళ్ళు కనబడక క్షవర వృత్తి చేయలేక పోతున్నారు వారి కుటుంబాన్ని పోషించలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 50 సంవత్సరాలకే నాయి బ్రాహ్మణులకు పింఛన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్న టైంలో నాయి బ్రాహ్మణులకు ఫ్రీగా కరెంటు కావాలని అప్పుడు నుండి పోరాడుతూనే ఉన్నా రని. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు రజకులకు 250 యూనిట్లు కరెంటు రాయితీ ఉంటుందని ప్రకటించింది కానీ అమలు చేయలేదు. నాయి బ్రాహ్మణుల సమస్య కరెంటు ఒకటే కాదు ఉండటానికి ఇల్లు లేదు ఎంతోమందికి షాపులు లేవు కానీ ఒక్క కరెంటు ప్రీ ఇచ్చి నాయి బ్రాహ్మణులకు ఏదో చేశానని చెప్పుకుంటుంది ప్రభుత్వం అసలు సమస్యలు పరిష్కారం చేయకుండా కరెంటు ఇచ్చి నాయి బ్రాహ్మణులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఇకనైనా తెలుసుకోండి ఈరోజు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మన నాయి బ్రాహ్మణులకు ఏమి చేయలేదు అందుకనే మన బహుజనుల నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కై బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మన బహుజనుల కోసం వారి సమస్యల కోసం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారము కొస్తే నేషనల్ ఎయిర్ కటింగ్ సెలూన్ నిర్మిస్తామని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రకటించడం జరిగింది ఇది ఒక్కటే సమస్య కాదు ఇంకా ఎన్నో సమస్యలు కోసం ప్రతి కుటుంబానికి ఎకరంభూమి 10 లక్షల ఉద్యోగాలు ప్రతి మండలంలో కార్పొరేట్ వైద్యశాల కార్పొరేట్ స్కూలు స్థాపిస్తారని సారు ప్రకటించడం జరిగింది బహుజనులు 90 శాతం ఉంటే అగ్రకులాల వారు 10 శాతం ఉన్నారు 90% ఉన్న మనం 10 శాతం ఉన్న వాళ్ళకి అధికారం కట్టబెడుతున్నాం వారు ఇచ్చే 500 1000 రూపాయలక వాళ్లకు ఓట్లేసి గెలిపిస్తున్నాం తర్వాత ఏ సమస్య అయినా వస్తే వారి దగ్గరికి వెళ్తే మనల్ని చిన్నచూపు చూడటం జరుగుతుంది. అలాంటి నాయకులు మనకెందుకు మనకోసం ఏడు సంవత్సరాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వదులుకొని మన బహుజనుల కోసం శ్రమిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ని తెలంగాణ ముఖ్యమంత్రిగా బీఎస్పీ జెండాని తెలంగాణ రాష్ట్రంలో ఎగరవేయాలని వారు అన్నారు. ఈ ప్రచారంలో నాయి బ్రాహ్మణులు. పాల్గొన్నారు.