
ఇచ్చోడ మండలకేంద్రంలో నిస్సహాయురాలు నర్సవ్వకు అండగా పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం.
వివరాల్లోకి వెళ్ళితే ఆదిలాబాద్ జిల్లా చ్చోడ మండలం కేంద్రములోని నవయువ కాలనీకి చెందిన నర్సవ్వ 80 ఏండ్ల వృద్దురాలి ఇల్లు ఉదయాన్నే కరెంటు షార్ట్ సర్క్యూట్ ద్వారా పూర్తిగా కాలిబూడిదయింది
ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలు అర్పేశారు. కాని అప్పటికే ఇంట్లో ఉన్న సామాన్లు, నెలనెల తనకు వచ్చే వృధ్యాప్య పెన్షన్ నుండి ఆరోగ్య రీత్యా మెడిసిన్ కొరకు దాచుకున్న ఐదు వేల రూపాయలు, బట్టలు, బియ్యం, మొత్తం మంటల్లో కాలియాయి. ఆ సమయంలో నర్సవ్వ ఇంట్లోనుండి బయటికి వెళ్లడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించబడింది.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న వెంటనే పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ సంఘటన స్థలాన్ని సందర్శించి సర్వస్వం కొలిపోయిన నర్సవ్వను పరామర్శించి, పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ క్రమములో నర్సవ్వతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా! నేను నివసించడానికి నీడకూడలేకుండా అయిపోయిందని వపోయింది.
ఈ ప్రమాదంపై అక్కడికి వచ్చిన స్థానికులను అడిగి నర్సవ్వ కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న క్రమములో నర్సవ్వ ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమెకు ముగ్గురు కుమారులు ఉండేవాళ్ళు అయితే పెద్ద కుమారుడు చనిపోయారని ఇక మిగిలింది ఇద్దరు కుమారులు అయితే వాళ్ళుకూడా రెక్కడితేగాని డొక్కాడని కడుపేదరికన్ని అనుభవిస్తున్నారని నర్సవ్వ కన్నీరుపెట్టుకున్నారు.
వారి దీనమైన పరిస్థితిని అర్ధం చేసుకున్న డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ నర్సవ్వను ఓదారుస్తూ, భయపడవద్దు తల్లి ధైర్యంగా ఉండండి. వీలైతే నేను మీ పక్షాన ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరగా నీకు ఇల్లు నిర్మించి ఇచ్చేలా కృషిచేస్తానని బలపరిచారు.
ఈ క్లిష్టమైన పరిస్థితిలో చుట్టుప్రక్కల వాళ్ళు మానవత్వంతో స్పందించి నర్సవ్వకు అండగా ఉండాలని పిలునిచ్చారు.
మరియు స్థానిక సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే మరియు తహసీల్దార్ కలిసి నర్సవ్వకు వెంటనే గృహాన్ని నిర్మించుకునేలా ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం అందేలా చొరవ చూపాలని కోరారు..
స్థానిక విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందో విచారణ జరిపి తిరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వ అధికారులను కోరారు.
ప్రజలుకుడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్ని కోరారు.