
*నువ్వా నేనా…
- *అధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా
- ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం
- దుమ్ము గూడెం….. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మధ్య వాగ్వివాదం
- బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో.. వేదికపై…. నువ్వా నేనా అన్నట్లు మాటలు యుద్ధం జరిగింది….
- రేగా కాంతారావు ప్రసంగిస్తూ పార్టీ ప్రస్తావన తీసుకురావడంతో అడ్డుకున్న పోదాం వీరయ్య అని సమాచారం.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
మే 10,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్మగూడెం మండలంలో తునికాకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో.. భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్యకి, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు మధ్య వాగ్వివాదం.. మంత్రి ఎదుటే.. ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రభుత్వ కార్యక్రమంలో.. పార్టీ సంక్షేమ పథకాలను వివరించడం సబబు కాదని ఎమ్మెల్యే పోదెం వాగ్వివాదనికి దిగారు. సర్ది చెప్పిన అధికారులు.
భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య ప్రసంగిస్తూ… పోడు భూములకు కూడా పట్టాలు ఇప్పించి నట్లయితే గిరిజన ప్రాంతం గిరిజనులందరూ కూడా.. అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. రేగా కాంతారావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తుందని.. ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తుందని రానున్న కాలంలో భద్రాచలం నియోజకవర్గం లో కూడా మా పార్టీ గెలుపొందుతుందని తెలిపారు.
దీంతో ఇది పార్టీ కార్యక్రమమా..ప్రభుత్వ కార్యక్రమమా అంటూ గట్టిగా గలాన్ని వినిపించడంతో వాగ్వివాదం చోటు చేసుకుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య ప్రసంగిస్తూ… పోడు భూములకు కూడా పట్టాలు ఇప్పించినట్లయితే గిరిజన ప్రాంతం గిరిజనులందరూ కూడా.. అభివృద్ధి చెందుతారని తెలియజేశారు.
రేగా కాంతారావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తుందని.. ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తుందని రానున్న కాలంలో భద్రాచలం నియోజకవర్గం లో కూడా మా పార్టీ గెలుపొందుతుందని తెలిపారు. దీంతో ఇది పార్టీ కార్యక్రమమా..ప్రభుత్వ కార్యక్రమమా అంటూ గట్టిగా గలాన్ని వినిపించడంతో వాగ్వివాదం చోటుచేసుకుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.