నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్
*కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రేపు, ఎల్లుండి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు.*
గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచడం దారుణం అన్నారు.
మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని తెలిపారు.
ఈ ధరల పెరుగుదల వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుక, ఈ సిలిండర్ ధరల పెంపు అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.