Telangana

“నేను మారాకుండా సమాజం ఎప్పటికీ మారదు: డాక్టర్ పీటర్ నాయక్ లకావత్”

“నేను మారాకుండా సమాజం ఎప్పటికీ మారదు: డాక్టర్ పీటర్ నాయక్ లకావత్”

మనిషి ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో ఉంటూనే తాను ఏంటి అనేది ఆలోచించకుండా సమాజాన్ని మార్చాలని ప్రయత్నిస్తూనే చివరికి పతనంవైపు ప్రయాణిస్తుంటాడు. ఇది చాలా ఆవేదన కలిగించే విషయం. ఎందుకంటే లోకములో ఉన్నా అన్ని చెడు వ్యాసనాలు తనను పాలిస్తున్నాయానే సంగతి మరిచిపోయి, ఎదుటి వారిని గురించి ఆలోచిస్తూ వారిని గురించి మాట్లాడుతూనే అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తుంటాడు. కానీ నిజంగా చెప్పుకోవాలంటే “మార్పు” అనే మాట చాలా అవసరమైన మంచి మాట..

ఇప్పటికి భారత దేశంలోగాని లేక ప్రపంచ దేశాల్లోగాని తీసుకుంటే ఆయదేశాల్లో ఆయరాజకీయ పార్టీలు నాయకులను గురించి వింటుంటాం చరిత్రలో వారి గురించి చదువుతూ ఉంటాం. ఎవరిని అడిగిన వారు చెప్పినమాటగాని, చెపుతున్నమాటగాని మరియు చెప్పభోయే మాటగాని ఒక్కటే అదేంటి అంటే సమాజంలో మార్పుకొరకు లేక ప్రజలకు సేవచేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మా పార్టీ స్థాపించబడింది అంటారు… కానీ నిజానికి లోతుగా వారిని గురించి ఆలోచిస్తే వ్యక్తిగతంగా వారిలో నైతిక మార్పులు కనిపించడం చాలా అరుదుగానే చెప్పుకోవచ్చు. అలాగని యావత్ రాజకీయ వ్యవస్థను తప్పుబట్టలేం నూటికి 98 శాతం మాటలకే పరిమితం మిగతా రెండు శాతం మాత్రమే రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంకు లోబడి అంతో ఇంతో ప్రజలకు నిజమైన సేవలు అందిస్తున్నవారు ఉన్నారు…

ఈ నేపథ్యంలో సమాజం అంటేనే అందులో ఒకడుగా నీవు నేను ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. సీజర్ చావెజ్ అనే గొప్ప మేధావి ఒక సందర్బంగా మాట్లాడుతూ, “ఒకసారి సామాజిక మార్పు ప్రారంభమైతే, దానిని తిప్పికొట్టలేము. చదవడం నేర్చుకున్న వ్యక్తిని మీరు విద్యావంతులను చేయలేరు. మీరు గర్వంగా భావించే వ్యక్తిని అవమానించలేరు. భయపడని ప్రజలను మీరు అణచివేయలేరు. మేము భవిష్యత్తును చూశాము మరియు భవిష్యత్తు మనది.” అని వ్రాశాడు. మానవ హక్కుల ఛాంపియన్స్
సీజర్ చావెజ్ (1927–1993)
మెక్సికన్-అమెరికన్ వ్యవసాయ కార్మికుడు, కార్మిక నాయకుడు మరియు పౌర హక్కుల కార్యకర్త సీజర్ చావెజ్ వ్యవసాయ కార్మికులకు మెరుగైన పరిస్థితులను తీసుకువచ్చారు. మార్పు మననుండి ప్రారంభం కావాలి. తర్వాత సమాజంలో మార్పు సహజంగానే వస్తుంది.

ప్రజాస్వామ్యా దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అర్ధంచేసుకోకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా మేము రాజకీయాలు చేస్తున్నామంటే, తాత్కాలికంగా మంచిగానే ఉంటుంది. కానీ ప్రజలు విసికివేశారిపోయినరోజు ఎంతటి పెద్ద రాజకీయ పార్టీనైనాసరే కచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం అయితే కొన్నిసార్లు శాంతిభద్రతలు కంట్రోల్ చేయలేని దుస్థితికి దిగజారిపోతుంది. కాబట్టి మార్పుపు అనేది మననుండి రావాలి అనేదే నాయొక్క ముఖ్య ఉద్దేశం.

అరిజోనాలోని యుమా సమీపంలోని తన కుటుంబ పొలంలో జన్మించిన చావెజ్, వ్యవసాయ కూలీలు అనుభవించిన కఠినమైన పరిస్థితులను చూశాడు. వారి యజమానులచే రొటీన్‌గా దోపిడీకి గురౌతున్నారు, వారు తరచుగా జీతాలు చెల్లించకుండా, వారి శ్రమకు బదులుగా గుడిసెలలో నివసిస్తున్నారు, వైద్య లేదా ఇతర ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఐక్య స్వరం లేకుండా, వారి స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి వారికి మార్గం లేదు.

కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయిన సరే రాజకీయాల్లో తొలిఅడుగుపెట్టినప్పుడు ఏమని ప్రజలకు హామీ ఇస్తామో దానికి కట్టుబడి ప్రజా క్షేమాన్ని కోరుకుంటూ ముందుకెళ్లాలి ఒక నాయకుడు సమాజానికి మంచి చేసినప్పుడు ప్రజలే తిరిగి తాను ఉండాలని కోరుకుంటారు. కానీ నేడు అటువంటి నాయకులను చూడలేకపోతున్నాం చాలా దురదృష్టకరం..! ఇక్కడ సిజర్ చావెజ్ అనే వ్యక్తిని ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఎవరైన ప్రజలకు సేవలు అందిస్తామని రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ఇంతకంటే గొప్ప సేవలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందించే అన్ని సౌకర్యాలు ఉండికూడా చేయలేకపోతున్నారు. కానీ సిజర్ చావెజ్ చేయగలిగారు. తాను ముందుగా వ్యక్తిగతంగా సంపూర్ణ మార్పును తన జీవితంలో చూడగలిగారు ఆ తర్వాతనే సమాజంలో మార్పును తీసుకురావాలనే సదుద్దేశంతో అనుకున్నది సాధించారు.

వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం గుర్తింపు పొందేందుకు తన జీవితాన్ని అంకితం చేసినప్పుడు చావెజ్ దానిని మార్చారు, వారిని ప్రేరేపించి, వారిని నేషనల్ ఫార్మ్ వర్కర్స్ అసోసియేషన్‌గా మార్చారు, అది తరువాత యునైటెడ్ ఫార్మ్ వర్కర్స్‌గా మారింది. కవాతులు, సమ్మెలు మరియు బహిష్కరణల ద్వారా, చావెజ్ యజమానులను తగిన వేతనాలు చెల్లించమని మరియు ఇతర ప్రయోజనాలను అందించమని బలవంతం చేశాడు మరియు వ్యవసాయ కార్మికుల కోసం మొదటి హక్కుల బిల్లును రూపొందించే చట్టానికి బాధ్యత వహించాడు.

సామాజిక న్యాయం పట్ల అతని నిబద్ధత మరియు ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి అతని జీవితకాల అంకితభావం కోసం, చావెజ్ మరణానంతరం అత్యున్నత పౌర గౌరవం, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో గుర్తించబడ్డాడు.
ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పడు ఒక పౌరుడుగా చాలా ఆవేదన కలిగిస్తుంది. మన నాయకులు మారకుండా సమాజంలో మార్పును తీసుకొస్తామంటే అది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. సమాజంలో సరైన మార్పుకొరకు ప్రతి నాయకుడు రేపటి తరానికి అదర్శం కావాలి..

-రచన: డాక్టర్ పీటర్ నాయక్ లకావత్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected