
పచ్చని సంసారంలో మద్యం చిచ్చు
మామూళ్ల మత్తులో అధికారులు
మణుగూరు ప్రతినిధి సతీష్ సికె న్యూస్ మే 7
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మణుగూరు మండలాల్లో మద్యం వ్యాపారుల బెల్ట్ దాందా కు అడ్డువదుకు లేకుండా పోయింది ప్రభుత్వాలు లైసెన్స్ షాపుల్లో దొరకని మద్యం బెల్టు షాపుల్లో లభిస్తుంది అంటే బెల్ట్ దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మందుబాబులకు మద్యం దొరకదు కానీ అధికంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులో మద్యం దొరుకుతుంది
వాహనాల ద్వారా స్టాక్ ను పంపిస్తున్నారని ఆరోపణలు వెళ్ళబోతున్నాయి అధిక లాభాల కోసమే ఈ ప్రయాసమని దీనివల్ల తాము ఎంతో నష్టపోతున్నామని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వైన్ షాపులలో విక్రయాలు జరగవలసిన షాపులో అమ్మకం కంటే బెల్ట్ షాపులకు విక్రయంచడం ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఘటిస్తున్నారు
మద్యం ప్రియులకు మాత్రం జేబు చిల్లు పడుతుంది, ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కూలి పని ఇతర శారీరక శ్రమ చేసేవారు ఎక్కువ వారికి కావలసిన బ్రాండ్ దొరకకపోవడంతో బెల్ట్ షాపులలో ఎక్కువ డబ్బులు కు కొనుకుంటున్నారు, ఇలా బెల్ట్ షాపు లలో కొనుగోలు చేయడం ద్వారా మద్యం ప్రియుల జేబు కు చిల్లు పడుతుందని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు
ఒక వైన్ షాప్ కి ఒక బెల్టు షాప్ అసలు ఎంత దూరంలో ఉండాలి అనే విషయాన్ని కూడా మరిచారు అధికారులు ఇప్పటికైనా అధికారులు ఈ రెండు మండలాలపై దృష్టి పెట్టి బెల్ట్ మరియు వైన్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు