
పడమటి నరసాపురంలో భూ వివాదం..!!
ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా లెక్క చేయకుండా భూ స్వాధీనం
పోలీస్ ఉన్నతధికారులకు భూ బాధితులు పిర్యాదు..
ఆత్మహత్యే గతి అంటున్న నిరుపేద భూ భాదితులు..
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని పడమటి నరసాపురం గ్రామంలోని భూ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ఆత్మ హత్యే గతి అంటున్న. భూ భాదితులు, బాధితులు తెలిపిన వివరాలమేరకు పడమటి నరసాపురం గ్రామ నివాసి అన్నవరపు రామారావు. 161 సర్వే నెంబర్ లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా, ఆ భూమిని ఆక్రమించుకోడానికి గత కొంతకాలంగా అతని తమ్ముడైన అన్నవరపు సత్యనారాయణ నిత్యం గొడవలు పడుతూ తాను బిజెపి జాతీయ నాయకుడిన్ని అంటూ భయబ్రాంతులకు గురిచేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేసేవాడని. ఈ క్రమంలోనే రామారావు మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణించాడని అన్నవరపు రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణ తన పేరుమీద వున్న భూమిని వేరే వాళ్లకు అమ్ముకొని, అమ్మిన తన భూమికి బదులుగా చనిపోయిన తన అన్న రామారావు భూమిని అప్పజెప్పాడని ఆమె వాపోయింది. తమ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించి భూమిని ఆక్రమించుకున్న విషయం తెలుసుకుని వెళ్లి మా భూమిలోకి ఫెన్సింగ్ ఎందుకు వేశారు ఇది మా భూమి అని కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడ ఉందని నిలదీసిన తమపై కేసులు పెట్టించిన సత్యనారాయణ తనకు రాజకీయ పలుకుబడి ఉందని రాష్ట్ర స్థాయిలో పోలీసులు నాకు తెలుసు నేను తలచుకుంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని అన్నవరపు రాజ్యలక్ష్మి తెలిపారు. ఆయన బెదిరింపులకు తట్టుకోలేక స్థానిక పోలీసులకు, ఉన్నత అధికారులకు పిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, మా కుటుంబానికి చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని రామారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.