
పదేండ్ల తెలంగాణలో….దండుకున్నది ఎవరు…దగా పడ్డది ఎవరు!!
సీకే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి(సంపత్)జూన్ 01
దండుకున్నది ఎవరు..దగా పడ్డది ఎవరు అనే అంశం పై ప్రెస్ క్లబ్ లో సమావేశం టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
గురువారం రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ హాజరై మాట్లాడుతూ పదేండ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు… దగా పడ్డది ఎవరో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం మనపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దండుకునేది కేసీఆర్ కుటుంబం, దగా పడ్డది తెలంగాణ నాలుకోట్ల ప్రజలు అని గద్దర్ ఆరోపించారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పరం ప్రసాద్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులందరికీ 15000 నుండి 20వేల వరకు జర్నలిస్టు భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల వరకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, తెలంగాణ ఉద్యమ నాయకులు గాదె ఇన్నయ్య, రాణి రుద్ర మాదేవి, జె ఏ సి విఠల్ రావు, మాజీ ఎం. పి. కొండా విశ్వశ్వర్ రెడ్డి, మాజీ ఎం. పి. బూర నర్సయ్య గౌడ్, అదేంకి దయాకర్, టీ జె యు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా, చిన్న పత్రికల సంఘము జిల్లా అధ్యక్షులు చింతకింది వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు గంగదారి శ్రవణ్ కుమార్, గౌరవ సలహాదారుడు పోతుగంటి సంపత్ కుమార్,టీ ఆర్ నైన్ రిపోర్టర్ భైరి విశ్వనాధం, విజయ రాజ్, సురారపు,నరేష్, ఫాసిద్దీన్, రసీద్,వివిధ జిల్లాల రిపోర్టర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, మేధావులు ఉద్యమకారులు, తదితరులు పాల్గొన్నారు.