
పనులకు మంగళం
పట్టించుకోని అధికారులు
గుత్తేదారుడి ఇష్టారాజ్యం
ప్రజాప్రతినిధులు చెప్పిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్న కాంట్రాక్టర్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్ విస్తరణ పనులకు తీవ్ర జాప్యం జరుగుతుంది.కాల్వల నిర్మాణం చేసి దాని పైన కప్ వేయాలి,కానీ పలు చోట్ల ఇష్టారాజ్యంగా పనులు గాలికి వదిలి వేశారు.ఈ కారణంగా షాప్ యజమానులు,ప్రజా ప్రతినిధులు చెప్పిన గుత్తేదారుడు పట్టించుకోకపోవాడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. కానీ అధికారులు మాత్రం కనీసం ఇటు వైపు చూడకపోవటంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయనికి గురిచేస్తుంది.
ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తు వదలి,కళ్ళు తెరిచి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఎలాంటి కప్పు పోయకపోవడంతో నెలల తరబడి దుకాణదారులకు, ప్రజాప్రతినిధులకు, వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది.అకస్మాత్తుగా కాల్వలో పడి
గాయాలపాలైన సంఘటనలు అనేకమున్నాయి. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం మేరకే పనులు కొనసాగే పరిస్థితి ఉండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.. ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్
పనులు చేస్తున్నారని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..వెంటనే కాల్వల నిర్మాణం మీద పైకప్పు ఏర్పాటుచేసేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.